AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చినికిచినికి గాలివాన : పోడు భూములలో కందకం తీస్తే ఖబర్దార్, తెలంగాణలో ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌

ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌... తెలంగాణలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. పోడు భూముల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది...

చినికిచినికి గాలివాన : పోడు భూములలో కందకం తీస్తే ఖబర్దార్, తెలంగాణలో ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌
Podu Cultivation
Venkata Narayana
|

Updated on: Feb 21, 2021 | 2:38 PM

Share

ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వర్సెస్‌ పొలిటికల్ లీడర్స్‌… తెలంగాణలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. పోడు భూముల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. రూల్‌బుక్‌ పట్టుకొని అధికారులు వాదిస్తుంటే… ప్రజల నాడి చూడాలంటున్నారు ప్రజాప్రతినిధులు. దీంతో మొత్తం వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌పై ప్రజాప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రిను ఎంపీటీసీ జడ్పీటీసీ వరకు అంతా ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నారు. కన్నెర్ర చేస్తే బాగోదంటూ అటవీశాఖ సిబ్బందికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పద్దతి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్య తెలంగాణవ్యాప్తంగా పోడుభూముల స్వాధీనం పేరుతో అటవీ శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాల్లో సిబ్బంది.. రైతుల పంట భూములు నాశనం చేశారు. యంత్రాలు ఉపయోగించి మరీ ఫీల్డ్స్‌ క్లియర్ చేశారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది. గిరిజన రైతులపై అటవీశాఖ సిబ్బంది దౌర్జన్యానికీ పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. గిరిజనులు తిరుగుబాటు చేస్తున్న చోట పోలీసులు రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోజుకోచోట యుద్ద వాతావరణం నెలకొంటుంది. అటవీశాఖ అధికారుల అత్యుత్సాహంతో భూములు కోల్పోయిన రైతులు విధిలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ వ్యవహారంపై మండిపడుతున్న లీడర్స్‌. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సీఎం కేసీఆర్ సానుకూలంగానే స్పందించారు. పోడు రైతుల పొట్ట కొట్టొద్దని అధికారులు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు పెడచెవిన పెట్టి బక్కచిక్కిన పేద రైతులపై ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ తమ ప్రతాపాన్నిచూపిస్తున్నారని లీడర్స్‌ ఫైర్‌ అవుతున్నారు. పోడు భూములలో జేసీబీలతో గుంతలు తవ్వి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాల్గొన్న లీడర్లు… ఫారెస్ట్‌ సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తే సాగనంపుతామని హెచ్చరించారు.

పోడు రైతుల జోలికి వస్తే సహించే ప్రసక్తేలేదని హెచ్చరించిన MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్ళడానికైన సిద్దమే అన్నారు. గూడూరు మండలం అటవీశాఖ సిబ్బందిని పిలిచి మందలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.. పోడు భూములలో కందకం తీస్తే ఖబర్దార్ అని హెచ్చరించాడు. నలభైయేళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న భూముల జోలికీ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. రైతులను రెచ్చగొడితే, తగినపాఠం చెబుతామన్నారు.

మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో గిరిజనులు ఆందోళనబాటపట్టార. గుత్తి కోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి తీవ్రంగా గాయపరచారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా నివాసముంటున్న తమపై దాడి చేసి గుడిసెలు కాల్చేశారని ఆరోపించారు. కాంపల్లి బీట్ ఆఫీసర్ రమేష్, పలిమేల బీట్ ఆఫీసర్ శ్రీను ఆధ్వర్యంలో కర్రలతో దాడి చేసి గాయ పర్చారని తెలిపారు. ఓ మహిళను విపరీతంగా కొట్టి తీవ్రంగా గాయపరిచిన బీట్ ఆఫీసర్స్ రమేష్, శ్రీను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులు. న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

మొత్తంమీద అటవీశాఖ సిబ్బంది వ్యవహారం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఆగ్రహాన్ని కల్గిస్తే… ఈ నేతల వ్యాఖ్యలు పోడు రైతులకు కాస్త ఉపశమనం కల్గించాయి. ఇంతకీ అటవీశాఖ సిబ్బంది చేత ఈ దాడులు చేయిస్తున్నది ఎవరు… ప్రభుత్వ అనుమతి లేకుండానే అటవీశాఖ సిబ్బంది ముందడుగు వేయగలదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read also : Meil : పోలవరం నిర్మాణంలో మరో మిరాకిల్, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా, స్పిల్ వే బ్రిడ్జి ఒక అద్భుతం