Meil : పోలవరం నిర్మాణంలో మరో మిరాకిల్, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా, స్పిల్ వే బ్రిడ్జి ఒక అద్భుతం

Megha Engineering and Infrastructure Limited : జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకఘట్టం..

Meil : పోలవరం నిర్మాణంలో మరో మిరాకిల్, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా, స్పిల్ వే బ్రిడ్జి ఒక అద్భుతం
Follow us

|

Updated on: Feb 21, 2021 | 1:18 PM

Megha Engineering and Infrastructure Limited : జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. నిర్మాణ సంస్థ మేఘా అతి తక్కువ కాలవ్యవధిలో ప్రాజెక్టు స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తిచేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్టక్చర్ సంస్థ, స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం లో కీలకమైన మొత్తం 192 గడ్డర్ల అమరికను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది మేఘా సంస్థ.

స్పిల్ వే పై గడ్డర్లు ఏర్పాటు పూర్తి కావడంతో ఇప్పుడు షట్టరింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మాణం పై దృష్టి పెట్టారు మేఘా నిపుణులు. 23 మీటర్లు పొడవు, 2 మీటర్ల ఎత్తున వున్న 192 గడ్డర్లను అతి తక్కువకాలంలో ఇరిగేషన్ అధికారుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది మేఘా సంస్థ. ఇక ఈ మహా క్రతువులో ఒక్కో గడ్డర్ తయారీకి 10టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు ఉంది. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.

గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ల సాయంతో అమరిక కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. జూలై 6 2020న గడ్డర్లను స్పిల్ వే పిల్లర్లపై పెట్టడం ప్రారంభమైంది. వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. గోదావరి నదికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి చేయడంతో అతి సమీపంలోనే పోలవరం జాతీయ ప్రాజక్టు జలసిరులు కురిపించబోతోంది.

Read also :

నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతవరణం, పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఇరు వర్గాల ఘర్షణలు, పోలీసుల జోక్యం

టీకాంగ్రెస్‌కి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఉత్తమ్‌కి రాజీనామా లేఖ, అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనం