బ్యాంకుల్లో మాయమవుతున్న బంగారం .. భయపెడుతున్న చోరీలు

బ్యాంకుల్లో మాయమవుతున్న బంగారం .. భయపెడుతున్న చోరీలు

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. బయట సెక్యూరీగార్డులు రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్నా బ్యాంకును లూటీ చేసేశారు. చిత్తూరు జిల్లా యదమరి మండల పరిధిలోగల మోర్ధానపల్లి వద్దగల అమరరాజా కంపెనీ ఆవరణలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదును మాయం చేశారు. ఎన్నో కట్టుదిట్టమై చర్యలు చేపట్టే బ్యాంకుల్లోనే ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 16, 2019 | 10:12 PM

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. బయట సెక్యూరీగార్డులు రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్నా బ్యాంకును లూటీ చేసేశారు. చిత్తూరు జిల్లా యదమరి మండల పరిధిలోగల మోర్ధానపల్లి వద్దగల అమరరాజా కంపెనీ ఆవరణలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదును మాయం చేశారు.

ఎన్నో కట్టుదిట్టమై చర్యలు చేపట్టే బ్యాంకుల్లోనే ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో బ్యాంకులపట్ల నమ్మకం లేకుండా పోతుంది. తాజాగా జరిగిన ఈ భారీ చోరీలో దొంగలు సీసీ కెమెరాలకు సంబంధించిన కంప్యూటర్ సర్వర్ మాయం కావడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?

శనివారం బ్యాంకుకు సెలవు. అయినా బ్యాంక్ మేనేజర్ మాత్రం బ్యాంకుకు వచ్చారు. ఇక ఆదివారం కూడా పూర్తి సెలవు కావడంతో దొంగతనం జరినట్టు ఎవరీకీ తెలియలేదు. సోమవారం యధావిధిగా బ్యాంకు తాళాలు తెరిచి చూసే సరికి చోరీ జరిగినట్టు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డీ క్లూస్‌ టీమ్‌తో పాటు స్నిప్పర్ డాగ్స్‌తో సహా అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, వద్ద ఉన్న తాళాలతో లాకర్లు ఓపెన్ చేసి చూశారు. అయితే లాకర్లలో ఉన్న కొద్దిపాటి నగదును వాసన చూసిన డాగ్స్.. దొంగలు వెళ్లిన మార్గంలో పరుగులు తీసి.. దగ్గర్లోని హైవే వరకు వెళ్లి ఆగిపోయాయి.

ఇంటిదొంగల పనేనా?

రూ. 3 కోట్లకు పైగా విలువ గల 17 కిలోల బంగారం చోరీ కావడం ఎన్నోఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసిన తాళాలు వేసినట్టే ఉండటం, లాకర్లలో బంగారు మాయం చేయడాన్ని బట్టి అత్యంత చాకచక్యంగా.. తెలివిగా ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సీసీ కెమెరాలకు సంబంధించిన కంప్యూటర్ సర్వర్ మాయం కావడం కూడా చోరీలో అనుమానాలను రెట్టింపు చేస్తోంది. ఇది ప్రొఫెషనల్స్ చేశారా? లేక ఇంటిదొంగల పనేనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో బ్యాంకు మేనేజర్‌ పురుషోత్తంతో పాటు క్యాషియర్‌ నారాయణను కూడా అదుపులోకి తీసుకుని నిజాలు రాబడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని చోరీ చేయడం వెనుకు దాగిఉన్న అసలు దొంగల పనిపట్టే పనిలో ఉన్నారు చిత్తూరు పోలీసులు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu