Crime News: పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించిందని మహిళపై దాడి.. దారుణంగా గొంతు కోసి..

UP Crime News: దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. మ‌హిళ‌లు, చిన్నారుల‌పై వేధింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో కూతురికి త‌న‌తో పెళ్లి చేసేందుకు నిరాక‌రించింద‌నే

Crime News: పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించిందని మహిళపై దాడి.. దారుణంగా గొంతు కోసి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2021 | 7:58 PM

UP Crime News: దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. మ‌హిళ‌లు, చిన్నారుల‌పై వేధింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో కూతురికి త‌న‌తో పెళ్లి చేసేందుకు నిరాక‌రించింద‌నే కోపంతో ఓ యువకుడు మ‌హిళ గొంతు కోశాడు. ఈ దారుణ సంఘటన ల‌క్నోలో సాదత్‌గంజ్‌ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. సాద‌త్‌గంజ్ ప్రాంతానికి చెందిన నిందితుడు ఆర్మాన్ అదే ప్రాంతానికి చెందిన ష‌రీఫ్ జ‌హ‌న్ కూతురిని ఇష్టపడ్డాడు. ఆమెకు త‌న‌తో వివాహం జ‌రిపించాల‌ని ఆర్మాన్‌.. యువతి తల్లి జ‌హ‌న్‌ను కోరాడు. అయితే.. యువకుడు చేసిన ప్రతిపాదనను మహిళ తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకున్న ఆర్మాన్ ఆదివారం తెల్లవారుజామున జ‌హ‌న్ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశాడు. అనంతరం ఆమె గొంతు కోశాడు. ఆపై ఖాళీ కాగితంపైన బ‌ల‌వంతంగా ఆమె వేలిముద్రను తీసుకుని ప‌రారైనట్లు పోలీసులు తెలిపారు.

జ‌హ‌న్ కేకలు వేయ‌డంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షరీఫ్‌ జహాన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గులాబ్‌ కి బాగియా ప్రాంతానికి చెందిన అర్మాన్‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్‌ జోన్‌ ఏడీసీపీ చిరంజీవ్‌ నాథ్‌ సిన్హా తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

Crime News: గన్నుతో పదో తరగతి విద్యార్థి హల్‌చల్‌.. ప్రిన్సిపాల్‌నే చంపబోయాడు.. ఎందుకంటే..?

Telangana: ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం.. చివరికి ఊహించని విషాదం

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..