Crime News: ఫోన్‌లో గేమ్ ఆడుతానంటూ తమ్ముడితో గొడవ.. క్షణికావేశంలో ఆ బాలిక ఏం చేసిందంటే..?
Mobile Phone Games: ఆధునిక ప్రపంచంలో చిన్నారులు మొబైల్ ఫోన్ గేమ్స్‌కు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో మనం చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఫోన్‌లో గెమ్స్ ఆడుతూ.. పిల్లలు క్షణికావేశంలో

Mobile Phone Games: ఆధునిక ప్రపంచంలో చిన్నారులు మొబైల్ ఫోన్ గేమ్స్‌కు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో మనం చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఫోన్‌లో గెమ్స్ ఆడుతూ.. పిల్లలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు శోకాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడే విషయంపై తన సోదరుడితో గొడవపడి.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సమతా నగర్ పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. తల్లిదండ్రులు పిల్లలతో సున్నితంగా వ్యవహరించాలంటూ వారు సూచించారు.
ఈ ఘటన కాందివలి తూర్పు జనపౌడలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి కాందివలి తూర్పులో నివాసముంటుంది. కాగా.. సెప్టెంబర్ 10న మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్న తన సోదరుడితో బాలిక గొడవపడింది. ఆమె కూడా అదే ఫోన్ వీడియో గేమ్ ఆడాలని వాదనకు దిగింది. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ జరిగి పోట్లడుకున్నారు. అనంతరం తల్లి జోక్యం చేసుకొని ఇద్దరిని గద్దించింది. ఆ తర్వాత కోపంతో బాలిక నేరుగా మెడికల్ స్టోర్‌కు వెళ్లి ఎలుకల మందును కొనుగోలు చేసి తిన్నది. అనంతరం గమనించిన బాలిక తల్లితండ్రులు అర్ధరాత్రి సమయంలో బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు ఆమె పరిస్థితి విషమించడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. బాలిక తరచూ గొడవపడుతుండేదని.. తోబుట్టువులతో, సోదరుడితో ఘర్షణకు దిగుతుండేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇలా చేయొద్దంటూ హెచ్చరించామని.. కానీ ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Also Read: