గంజాయి ముఠాను పట్టించిన గూగుల్ మ్యాప్..! ఎలాగంటే..?

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ఓ గంజాయి ముఠా అడ్డంగా బుక్ అయ్యింది. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్ వెళ్లాల్సి ఉండగా దారి చూపేందుకు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి బయల్దేరారు.

గంజాయి ముఠాను పట్టించిన గూగుల్ మ్యాప్..! ఎలాగంటే..?
Follow us

|

Updated on: Aug 26, 2020 | 6:14 PM

ఎరక్కపోయి వచ్చి..ఇరుక్కుపోయారు.. అంటే ఇదే మరీ! గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ఓ గంజాయి ముఠా అడ్డంగా బుక్ అయ్యింది. పోలీసుల కళ్లుగప్పి భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుబడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

గూగుల్ మ్యాప్ నమ్ముకొని గంజాయి తరలిస్తున్న వారికి నందిగామ పోలీసులు చుక్కలు చూపించారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి 193 కేజీల గంజాయితో బయలుదేరిన నలుగురు వ్యక్తులను నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్ వెళ్లాల్సి ఉండగా దారి చూపేందుకు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి బయల్దేరారు. ఆ గూగుల్ మ్యాప్ వారి పాలిట శాపంగా మారింది.

తెలంగాణలోని భద్రాచలం, చింతూరు మీదుగా మధిర నుంచి ఆంధ్రాలోనికి రావడానికి జొన్నలగడ్డ చెక్ పోస్ట్ లు దాటాలి. అది తెలియని వారు జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు అడ్దంగా బుక్ అయ్యారు. వీరిని విచారణ అనంతరం పోలీసులు వైజాగ్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాము దగ్గర నుంచి బీదర్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అనుమానం రాకుండా ఉండేందుకు స్కోడా కారులో ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తుండగా పోలీసుల తనిఖీ లో పట్టుబడ్డారు. ఈ గంజాయిని బుక్ చేసుకున్న బీదర్ వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు.