TSRTC Bus: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. సీటివ్వ లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రోజుకో‌ సమస్యను మోసుకొస్తోంది. బస్సుల్లో సీట్లు లేవని గొడవలు సర్వసాదరణంగా మారగా.. ఇప్పుడు అలాంటి ఓ గొడవే ఏకంగా ఓ బస్ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. బస్ లో సీటు లేదనే కోపంలో ఓ ప్రయాణికుడు ఏకంగా కండక్టర్ చెంప కొరికిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

TSRTC Bus: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. సీటివ్వ లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
Bus Conductor
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 21, 2023 | 3:05 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రోజుకో‌ సమస్యను మోసుకొస్తోంది. బస్సుల్లో సీట్లు లేవని గొడవలు సర్వసాదరణంగా మారగా.. ఇప్పుడు అలాంటి ఓ గొడవే ఏకంగా ఓ బస్ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. బస్ లో సీటు లేదనే కోపంలో ఓ ప్రయాణికుడు ఏకంగా కండక్టర్ చెంప కొరికిన ఘటన ఆదిలాబాద్ – మహారాష్ట్ర సరిహద్దులో చోటు చేసుకుంది. టికెట్ తీసుకున్నా నిలబడి ప్రయాణం చేయాల్సిన కర్మ నాకేంటంటూ ఆర్టీసీ కండక్టర్ తో గొడవకు దిగిన ఓ ప్రయాణికుడు, తన డబ్బులు‌ తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. చేసేది లేక కండక్టర్ డబ్బులు తిరిగిచ్చినా.. దాడి మాత్రం తప్ప లేదు.

ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని పాండ్రకవడకు ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు వెళ్లి తిరిగొస్తోంది. మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద హస్నాపూర్‌కు చెందిన అజీంఖాన్ అనే వ్యక్తి బస్ ఎక్కి ఆదిలాబాద్‌కు ఓ టికెట్ తీసుకున్నాడు. ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు దొరకలేదు. కొద్ది‌ దూరం ప్రయాణించాక.. ఫ్రీగా వస్తున్న వాళ్లకు సీట్లిచ్చావ్.. డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్న నన్ను నిల్చోబెట్టావు. నాకు‌ సీటివ్వూ అంటూ కండక్టర్ ఎన్ఏ ఖాన్‌‌తో గొడవకు దిగాడు అజీం ఖాన్. సీటు ఇవ్వక పోతే నా డబ్బులు నాకు తిరిగొచ్చేయాలంటూ నానా రచ్చ చేయడంతో, అతనికి డబ్బులు తిరిగిచ్చేశాడు కండక్టర్.

కానీ‌ కథ ఇక్కడే ఆగిపోలేదు.. బస్ దిగిన అజీం ఖాన్ మరో ప్రైవేట్ వాహనంలో ఆర్టీసీ బస్ ను ఛేజ్ చేసి ఆదిలాబాద్ సరిహద్దులోకి రాగానే మరోసారి కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. తోటీ ప్రయాణికులు అడ్డుపడుతున్నా వినకుండా రచ్చరచ్చ చేశాడు అజీం ఖాన్. మళ్లీ ఎందుకు ఎక్కావంటూ కండక్టర్ నిలదీయడంతో ఆగ్రహానికి గురైన అజీంఖాన్.. కండక్టర్ చెంపను‌ గట్టిగా కొరికి పరారయ్యాడు. ఆదిలాబాద్ చేరుకోగానే ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసులను ఆశ్రయచాడు కండక్టర్. ఫిర్యాదు అందుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏంటో ఏమో ఈ ఉచిత ప్రయాణాలు ఇంకెన్ని రచ్చలకు కారణమవుతాయో అంటూ నిట్టూరుస్తూ బస్ దిగి వెళ్లిపోవడం ప్రయాణికుల వంతైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ