AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Murdered: భారత వైమానిక దళ మాజీ పైలట్‌ దంపతుల హత్య.. వీరిని అందుకే హత్య చేశారా..?

Couple Murdered: దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దొంగతనానికి వచ్చి హత్యలకు పాల్పడం, పాత కక్షల కారణంగా ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు...

Couple Murdered: భారత వైమానిక దళ మాజీ పైలట్‌ దంపతుల హత్య.. వీరిని అందుకే హత్య చేశారా..?
Subhash Goud
|

Updated on: Feb 09, 2022 | 1:29 PM

Share

Couple Murdered: దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దొంగతనానికి వచ్చి హత్యలకు పాల్పడం, పాత కక్షల కారణంగా ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. బెంగళూరు పశ్చిమ శివారులోని ఈగిల్‌టన్‌ రిస్టార్ట్‌లో విల్లాలో భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్‌ పైలట్‌, అతని భార్య హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. ఈ విషయం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు చెన్నైకి చెందిన రఘురాజన్‌ (70), అతని భార్య ఆశా (63)గా గుర్తించారు పోలీసులు. ఈ దంపతులకు ఇద్దరు కుమారు ఉన్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని ఒక ప్రైవేటు సంస్థలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం.. కుమారులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా, వారు స్పందించకపోవడంతో విల్లా సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. సెక్యూరిటీ గార్డు వెళ్లి పరిశీలించగా, వారు రక్తపు మడుగులో పడి ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రక్తపు మడుగులో దంపతులు

సెక్యూరిటీ గార్డు ఇంటి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు కనిపించినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. దంపతులు నిద్రిస్తున్న సమయంలో దుండగులు తలలపై సుత్తితో కొట్టినట్లు గుర్తించారు. సమాచారం అందుకుని విల్లాను పరిశీలించినట్లు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు.

విలువైన వస్తువులను దొంగిలించేందుకే ఈ హత్య..

కాగా, ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించేందుకే దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఛేదించడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

Tragedy: గ్రామ వాలంటీర్ నిర్వాకానికి ఐదుగురు అమాయకులు బలి.. ఒక్కో కుటుంబానిది ఒక్కొక్క కన్నీటిగాథ!

తప్పు తెలుసుకుని.. తప్పుకుందామనుకున్న వివాహిత.. అంతలోనే దారుణం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!