అమానుష ఘటన.. ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఆటోలో మరణించిన నిండు గర్భిణి

ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఓ నిండు గర్భిణి ప్రాణాలను తీసుకుంది. వైద్యం మాట అటుంచితే కనీసం ఆమెను చేర్చుకునేందుకు కూడా పలు ఆసుపత్రులు నిరాకరించాయి.

అమానుష ఘటన.. ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఆటోలో మరణించిన నిండు గర్భిణి
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 3:27 PM

ఆసుపత్రుల నిర్లక్ష్యం.. ఓ నిండు గర్భిణి ప్రాణాలను తీసుకుంది. వైద్యం మాట అటుంచితే కనీసం ఆమెను చేర్చుకునేందుకు కూడా పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో పురిటి నొప్పులు భరించలేక ఆటోలో వెళుతూ వెళుతూనే ఆ గర్భిణి కన్నుమూసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. మే 25 అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ఘటన అధికారుల దృష్టికి చేరింది. ఈ క్రమంలో ముంబ్రా పోలీసులు తాజాగా మూడు ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అస్మా మెహందీ అనే 26 ఏళ్ల గర్భిణికి మే 25న పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అస్మాను చేర్చుకునేందుకు మూడు ఆసుపత్రులు నిరాకరించాయి. మొదట బిలాల్‌ ఆసుపత్రికి వెళ్లగా వారు నిరాకరించడంతో.. ఆ తరువాత అస్మాను తీసుకొని ప్రైమ్‌ క్రిటీ కేర్, యూనివర్సల్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఆ మూడు ఆసుపత్రులు గర్భిణిని చేర్చుకునేందుకు నిరాకరించాయి. దీంతో నాలుగో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో నొప్పులు భరించలేకపోయిన అస్మా ఆటోలోనే కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ముంబ్రా పోలీసులు ఆ మూడు ఆసుపత్రులపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత రామ్ కదమ్ ఈ ఘటన తనను షాక్‌కి గురి చేసిందని అన్నారు.

Read This Story Also: క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ బాక్సర్‌కి కరోనా..!

ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?