AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం.. కొడుకును రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సొంత కొడుకు శివకృష్ణను రోకలి బండతో కొట్టి చంపాడు సాక్షాత్తూ

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం..  కొడుకును రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి
Kurnool Murder
Venkata Narayana
|

Updated on: Aug 23, 2021 | 8:40 AM

Share

Kunool Father Murder: కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సొంత కొడుకు శివకృష్ణను రోకలి బండతో కొట్టి చంపాడు సాక్షాత్తూ తండ్రి గుర్రప్ప. కుటుంబ కలహాలే హత్యకు కారణం అంటున్నారు స్థానికులు. విషయం తెల్సుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న పాములకు చెల్లితో రాఖీ కట్టించిన అన్నయ్య.. అంతలోనే ఊహించని షాక్

విష సర్పంతో సయ్యాట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా పనితో చావు కొని తెచ్చుకున్నాడు. రాఖీ వేళ అందరిలానే ఆ అన్నయ్య కూడా చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు. అంతేకాదు తాను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే పాములకు కూడా చెల్లితో రాఖీ కట్టించాలనుకున్నాడు. ఆ కోరికే అతడి ప్రాణం తీసింది. ఒక పాముకు అతడి చెల్లి రాఖీ కడుతుంటే అక్కడే మరో పాము అతడి కాలిపై కాటువేసింది. క్షణాల్లోనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. ఇలా రాఖీ పండగ రోజే.. చెల్లి కళ్లు ముందే.. అన్నయ్య చనిపోయాడు. బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాఖీ పండుగ పూట ఆ కుటంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.

ఇక, వివరాల్లోకి వెళ్తే… సారణ జిల్లాలోని శీతల్‌పూర్ గ్రామానికి చెందిన దిగంబర్ సాహా, మంజు కున్వార్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ముగ్గురు అన్నాదమ్ముళ్లలో మన్మోహన్(24) రెండో వాడు. వృత్తిరీత్యా రైతు అయిన మన్మోహన్.. అదే గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వ్యవసాయంతో పాటు పాములంటే మన్మోహన్‌కు ఎంతో ఇష్టం. పాములను మచ్చిక చేసుకోవడంలో దిట్ట. గ్రామంలోకి ఎలాంటి పాములు వచ్చిన ఇట్టే పట్టుకుని మచ్చిక చేసుకుంటాడు. అందరూ ఇంట్లో పిల్లులు, కుక్కలను పెంచుకుంటే.. మన్మోహన్ మాత్రం పాములను పెంచుకుంటున్నాడు. నాగు, నాగిని జంటను కన్నపిల్లల్లా సాదుతున్నాడు. పామును వన్యప్రాణిలా కాకుండా సొంత కుటుంబ సభ్యుడిలా.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు.

ఇదే క్రమంలో ఆదివారం రాఖీ పండగ కావడంతో మన్మోహన్ చెల్లి సులోచన అతడికి రాఖీ కట్టింది. అయితే, తనతో పాటు నాగుపాముకు కూడా రాఖీ కట్టాలని.. అతడు కూడా మీ తమ్ముడే కదా.. చెల్లితో చెప్పాడు. అన్న విజ్ఞప్తి మేరకు నాగుకు కూడా సులోచన రాఖీ కట్టింది. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న నాగిని మెల్లగా మన్మోహన్ కాలిపై కాటువేసింది. పాము కాటు వేసినా అతడు లైట్ తీసుకున్నాడు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి విషమించింది. అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే మన్మోహన్ కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మన్మోహన్ కన్నుమూశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read also: Corona Vaccination: జంటనగరాల్లో పెద్ద ఎత్తున మొదలైన కరోనా వ్యాక్సినేషన్​స్పెషల్ డ్రైవ్.. వెళ్లి టీకా వేయించుకోండి మరి

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి