AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో ఈతకు వెళ్లిన 8 మంది విద్యార్థులు మృతి..

నదిలో మునిగి ఎనిమిది మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. సరదాగా నదిలో ఈతకొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన...

నదిలో ఈతకు వెళ్లిన 8 మంది విద్యార్థులు మృతి..
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 22, 2020 | 2:23 PM

Share

నదిలో మునిగి ఎనిమిది మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. సరదాగా నదిలో ఈతకొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చైనా దేశం చోంగ్ కింగ్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చైనాలోని చోంగ్ కింగ్ నగరం గల ఓ నదిలో ఈత కొట్టేందుకు పాఠశాల విద్యార్థులు 8 మంది కలిసి వెళ్లారు. ఓ విద్యార్థి ఈత కొడుతూ నదిలో మునిగిపోతుండగా, అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురు విద్యార్థులు నదిలోకి దూకారు. దీంతో 8మంది విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది నదిలో నుంచి 8 మంది బాలుర మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.