AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌.. ఈడీ రైడ్‌లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం..

దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ రైడ్స్ కలకలం సృష్టించాయి. కోట్ల రూపాయల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజధాని ఢిల్లీతో పాటు.. ఘజియాబాద్‌ ప్రాంతాల్లో టూర్స్‌ అండ్ ట్రావెల్స్‌..

షాకింగ్‌.. ఈడీ రైడ్‌లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 5:31 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ రైడ్స్ కలకలం సృష్టించాయి. కోట్ల రూపాయల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజధాని ఢిల్లీతో పాటు.. ఘజియాబాద్‌ ప్రాంతాల్లో టూర్స్‌ అండ్ ట్రావెల్స్‌ కంపెనీలకు చెందిన డైరక్టర్లు, సీఏల కార్యాలయాల్లో, నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 9వ తేదీన ఢిల్లీ, ఘజియాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్ చేశారు. ఈ సంస్థలు ఈ-వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతూ.. లెక్కల్లో చూపకుండా.. అనధికారికంగా గేట్‌వేల ద్వారా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో రైడ్స్ చేశారు. ఈ క్రమంలో రూ.3.57 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఈ సోమ్ము అంతా లెక్కల్లో చూపకుండా ఉంచారని అధికారులు తెలిపారు. పలు డాక్యుంమెంట్లతో పాటు.. డిజిటల్‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేశారు.

Investigations under FEMA, 1999 were initiated against various entities incl tour & travel companies on basis of specific inputs that they were involved in unauthorised receipt of foreign remittances through payment gateways in the name of providing e-visa services to foreigners. https://t.co/SJ1se9AVuE

— ANI (@ANI) July 11, 2020