AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య !

గారాల పట్టి..ఒక్కగానొక్క కూతురు..అప్పటిదాక కళ్లముందే తిరిగిన కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ తండ్రిని కుంగదీసింది. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన ద్రోహానికి కుమిలిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు కళ్లముందు లేకపోవడంతో ఈ లోకమే వద్దనుకున్నాడు. అత్యంత విషాదంగా.. రైలు పట్టాలపై పడుకొని తన కూతురు దగ్గరికి వెళ్లిపోయాడు.

కూతురు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 4:43 PM

Share

గారాల పట్టి..ఒక్కగానొక్క కూతురు..అప్పటిదాక కళ్లముందే తిరిగిన కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ తండ్రిని కుంగదీసింది. తండ్రిగా.. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన ద్రోహానికి కుమిలిపోయాడు. మాటల్లో చెప్పలేనంత బాధ. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు కళ్లముందు లేకపోవడంతో ఈ లోకమే వద్దనుకున్నాడు. బిడ్డ పోయినవారం రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యంత విషాదంగా.. రైలు పట్టాలపై పడుకొని తన కూతురు దగ్గరికి వెళ్లిపోయాడు.

ఇదీ ఎవరి కథో కాదు. వారం క్రితం ఓ నమ్మక ద్రోహి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ఆద్య తండ్రి కథ. ఆద్య తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి కల్యాణ్‌ భువనగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర కల్యాణ్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య తప్పుదోవ పట్టడం.. కూతురు దూరం అవడంతో మానసికంగా కుంగిపోయిన కల్యాణ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కళ్యాణ్.. అనూషను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనూష, కల్యాణ్‌ దంపతులు రెండేళ్లుగా ఇస్మాయిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కూతురు ఆద్య ఉంది. కల్యాణ్‌ ఆత్మకూరు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం పరిచయం అయిన కరుణాకర్ తో చనువుగా ఉంటూ వస్తోంది అనూష. భర్త విధులకు వెళ్లిన సమయంలో కరుణాకర్‌ అనూష వద్దకు వచ్చేవాడు. అతడి వెంట అప్పుడప్పుడూ అతడి స్నేహితుడు రాజశేఖర్‌ కూడా ఉండేవాడు. అయితే కొన్ని రోజులుగా కరుణాకర్ ను దూరం పెడుతూ మరో స్నేహితుడు రాజశేఖర్ తో అనూష చనువుగా ఉంటోంది. ఈనెల 2న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అనూష ఇంటికి వచ్చాడు కరుణాకర్. అప్పటికే రాజశేఖర్ ఇంట్లో ఉండడంతో ఆవేశంతో ఊగిపోయాడు కరుణాకర్. తనతో తెచ్చుకున్న సర్జికల్ కత్తితో ఆద్యను గొంతుకోసి చంపాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదకపోయింది. తీవ్రంగా రక్తం పోవడంతో ఆ చిన్నారి మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ దారుణాలను తట్టులేకపోయాడు ఆద్య తండ్రి కళ్యాణ్. మానసకింగా కుంగిపోయాడు. చివరు తన ప్రాణాలనే తీసుకున్నాడు.

ప్రేమగా చూసుకునే భర్త, బుట్టబొమ్మలాంటి కుమార్తె చింతల్లేని ఫ్యామిలీ. కానీ అనూషకు అవి తృప్తి ఇవ్వలేదు. సరదాగా మొదలైన సోషల్ మీడియాలో పరిచయాలు ఆమెను పక్కదారి పట్టించాయి. కరుణాకర్‌తో మొదలైన సరదా మాటలు శారీరక సంబంధం దాకా వెళ్లాయి. అతడి ద్వారా పరిచయమైన రాజశేఖర్‌తోనూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి అదే ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని గ్రహించలేకపోయింది. రాజశేఖర్‌తో చనువు పెంచుకోవడాన్ని కరుణాకర్‌ జీర్ణించుకోలేకపోయాడు. చివరికి అనూషపై వున్న కోపాన్ని చిన్నారి ఆద్యంపై చూపించాడు కరుణాకర్‌. ఆ చిన్నారి గొంతు కోసి ప్రాణం తీశాడు కఠినాత్ముడు.

తను చేసిన పాపానికి కన్న కూతురు బలైంది. ప్రేమను పంచిన భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఒక తప్పు ఓ కుటుంబాన్ని ఎలా చిదిమేస్తుందనడానికి ఈ సంఘటనే సాక్ష్యం. విలువలను మర్చిపోతే ప్రాణాలే పోతాయనడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం.