AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్‌ పెట్టుకోమని మంచి మాట చెబితే ప్రాణంపోయేలా కొట్టారు

మాస్క్‌ పెట్టుకోండ్రా.. అది మీకూ మంచిది.. మాకూ మంచిది అని రెండు మంచి మాటలు చెప్పినందుకు పాపం బస్‌ డ్రైవర్‌ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారో ముగ్గురు వ్యక్తులు

మాస్క్‌ పెట్టుకోమని మంచి మాట చెబితే ప్రాణంపోయేలా కొట్టారు
Balu
|

Updated on: Jul 11, 2020 | 5:37 PM

Share

మంచి చెబితే చెవికెక్కించుకోని మూర్ఖాగ్రేసరులు ప్రపంచమంతా ఉంటారు. మాస్క్‌ పెట్టుకోండ్రా.. అది మీకూ మంచిది.. మాకూ మంచిది అని రెండు మంచి మాటలు చెప్పినందుకు పాపం బస్‌ డ్రైవర్‌ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారో ముగ్గురు వ్యక్తులు. ఇది జరిగింది ఫ్రాన్స్‌లో.. 59 ఏళ్ల పిలిప్పే మంగీల్లాట్‌ ఫ్రాన్స్‌లో బస్సు డ్రైవర్‌.. బయోన్నెకు బస్సు నడుపుతూ ఉంటాడు. లాస్ట్‌ వీక్‌ మాస్క్‌లు పెట్టుకోకుండా ఓ ముగ్గురు వ్యక్తులు బస్సెక్కారు.. మాస్క్‌లు పెట్టుకుంటే కానీ బస్సు ఎక్కనివ్వనన్నాడు ఫిలిప్పే.. మమ్మల్నే మాస్క్‌లు పెట్టుకోమంటావా అంటూ ఆ ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్‌తో తీవ్రంగా కొట్టారు.. తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు ఫిలిప్పే.. ఆ డ్రైవర్‌ను అక్కడే వదిలేసి ఆ ముగ్గరు పారిపోయారు.. కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఫిలిప్పేను హాస్పిటల్‌లో చేర్పించారు.. తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. ఫిలిప్పెకు అమర్చిన వెంటిలెటర్‌ను కుటుంబసభ్యుల అనుమతితో తొలగించిన కాసేపటికే చనిపోయాడు. ఫిలిప్పేపై దాడికి దిగిన ఆ ముగ్గురు వ్యక్తులపై మర్డర్‌ కేసు పెట్టామని, వారి కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..