AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varity Theft: వానరాలే వారి అస్త్రం.. కోతులతో మాయ చేసి లీలగా దోచేస్తారు.. జర భద్రం గురూ !

మీ జేబులో డబ్బు ఉంటే.. మీరు ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే, జాగ్రత్తగా ఉండండి.  ఎందుకంటే మీరు దేశ రాజధానిలో వినూత్న పద్దతిలో మీ జేబు కొల్లగొట్టే ముఠా ఒకటి సంచరిస్తుంది.

Varity Theft: వానరాలే వారి అస్త్రం.. కోతులతో మాయ చేసి లీలగా దోచేస్తారు.. జర భద్రం గురూ !
Varity Theft
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2021 | 3:55 PM

Share

మీ జేబులో డబ్బు ఉంటే.. మీరు ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే, జాగ్రత్తగా ఉండండి.  ఎందుకంటే మీరు దేశ రాజధానిలో వినూత్న పద్దతిలో మీ జేబు కొల్లగొట్టే ముఠా ఒకటి సంచరిస్తుంది.  ఈ ముఠా దోపిడీకి ఏ ఆయుధాన్ని ఉపయోగించదు. వానరమే వారి అస్త్రం. ఈ దొంగలు కోతులకు ట్రైనింగ్ ఇచ్చి.. ప్రజలను చుట్టుముట్టి, వారి జేబుల్లో నుంచి డబ్బును మాయచేసి దోచేస్తారు. తాజాగా ఈ కోతుల దోపిడీ ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాల్వియా నగర్‌లో నిందితులు ఒక కోతిని మహిళపైకి వదిలి, ఆమె నుంచి రూ. 6000 ను దోచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, ఒక న్యాయవాదిని బాధితురాలిగా కనుగొన్నారు. కోతి సాయంతో తన వద్ద ఉన్న డబ్బును లాగేసుకున్నారని ఆమె వెల్లడించారు. దీంతో అలర్టైన పోలీసులు… నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న అన్ని సీసీ టీటీ పుటేజీలను చెక్ చేశారు..

కోతి దాడి చేస్తుందనే భయాన్ని చూపిస్తూ ఈ దొంగలు దోపిడీ చేస్తారు…

ఎట్టకేలకు పోలీసులు నిందితులైన బల్వాన్ నాథ్, విక్రమ్ నాథ్‌ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిద్దరినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  వారిద్దరూ తమ మూడవ పార్టనర్‌తో కలిసి కోతి కరుస్తుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. దోపిడీలకు తెగబడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న రెండు కోతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రస్తుతం వన్యప్రాణి విభాగానికి అప్పగించారు. పరారీలో ఉన్న వారి మూడవ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్…రైల్వే సేవలు రద్దు చేస్తారా? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!