AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్.. డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై మరో కేసు..!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్.. డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై మరో కేసు..!
Manish Sisodia
Balaraju Goud
|

Updated on: Mar 16, 2023 | 1:55 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. సీబీఐ జైల్లో ఉన్న సిసోడియాపై ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. మనీష్ సిసోడియాతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చింది సీబీఐ. కొద్ది రోజుల క్రితం సిసోడియాను ప్రాసిక్యూటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారని అభియోగాలు నమోదు చేసింది.

సీబీఐ తాజాగా నమోదు చేసిన కేసులో ఢిల్లీ ప్రభుత్వ మాజీ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ పేర్లను కూడా చేర్చింది సీబీఐ. కాగా గురువారం రోజు ఈడీ విచారణ కు హాజరు కావాల్సి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య కారణాల రీత్యా రాలేనని ఈడీకి లేఖ రాసింది.

ఇదిలావుంటే కవిత తరఫు న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చి పలు పత్రాలు ఇచ్చాడు. గతంలో కవితను ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా విచారించారని అన్నారు. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని, మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందన్నారు. విచారణను సాయంత్రం ఆరు గంటలలోపు పూర్తి చేయాలన్నారు. అయితే ఈడీ నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్సీ కవితను విచారణ చేపట్టారని న్యాయవాది సోమ భరత్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
అమ్మవారి ఆలయంలో అదృశ్య మేక ప్రత్యక్షం..దగ్గరికెళితే మాయం!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
షిర్డీ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్..
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..!
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన