బస్టాప్‌లో కరోనా పేషంట్‌ అనుమానాస్పద మృతి.. విచారణకు ఆదేశించిన సీఎం..!

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరొన 67ఏళ్ల వృద్ధుడు ఓ బస్టాండ్‌ సమీపంలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ విచారణకు ఆదేశించారు. కాగా అహ్మదాబాద్‌ దనిలిందా ప్రాంతంలోని రోహిత్ పార్క్‌ సొసైటీకి చెందిన చగాన్‌ మక్వాన అనే వ్యక్తి శ్వాస సంబంధ ఇబ్బందులు ఉండటంతో.. కుటుంబ సభ్యులు స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో చగాన్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. […]

బస్టాప్‌లో కరోనా పేషంట్‌ అనుమానాస్పద మృతి.. విచారణకు ఆదేశించిన సీఎం..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 5:46 PM

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరొన 67ఏళ్ల వృద్ధుడు ఓ బస్టాండ్‌ సమీపంలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ విచారణకు ఆదేశించారు.

కాగా అహ్మదాబాద్‌ దనిలిందా ప్రాంతంలోని రోహిత్ పార్క్‌ సొసైటీకి చెందిన చగాన్‌ మక్వాన అనే వ్యక్తి శ్వాస సంబంధ ఇబ్బందులు ఉండటంతో.. కుటుంబ సభ్యులు స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో చగాన్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో ఈ నెల 10న అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండమన్నారు. అయితే ఈ నెల 16న BRTS బస్టాప్‌ సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో అతడి మృతదేహం నుంచి ఫోన్‌, లెటర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చగాన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు షాక్‌కు గురయ్యారు.

కరోనా వచ్చిన తరువాత చగాన్‌ను ఆసుపత్రిలో చేర్పించిన సమయంలో అక్కడ తమ నంబర్లు ఇచ్చామని ఆయన కుమారులు చెబుతున్నారు. ఆ తరువాత ఆసుపత్రి నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని.. కానీ తమ తండ్రి మరణించాడని తెలిసి షాక్‌కు గురయ్యామని వారు అంటున్నారు. తమ తండ్రి కోలుకున్న తరువాత తమకు ఇన్ఫార్మ్ చేస్తామని ఆ ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి చగాన్‌ ఎలా మిస్‌ అయ్యాడో చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం విజయ్‌ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రెండు రోజుల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని రిటైర్ట్ ఐఏఎస్ జేపీ గుప్తాకు విజయ్ తెలిపారు.

Read This Story also: ‘వర్క్ ఫ్రమ్ హోమ్‌’పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!

Latest Articles
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ