FD scam: ఎఫ్డీల గల్లంతులో సరికొత్త కోణం.. పోలీసుల ఎదుటే అధికారులు మధ్య వాగ్వాదం
ఎఫ్డీల గల్లంతుపై ప్రభుత్వ, బ్యాంక్ అధికారుల మధ్య వివాదం రేగుతోంది. పోలీసుల ఎదుటే ఆయిల్ ఫెడ్, బ్యాంక్ అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయిల్ ఫెడ్ అధికారులు చూపిస్తున్న బాండ్లు నకిలీవని అంటున్నారు.
ఎఫ్డీల గల్లంతులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎఫ్డీల గల్లంతుపై ప్రభుత్వ, బ్యాంక్ అధికారుల మధ్య వివాదం రేగుతోంది. పోలీసుల ఎదుటే ఆయిల్ ఫెడ్, బ్యాంక్ అధికారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయిల్ ఫెడ్ అధికారులు చూపిస్తున్న బాండ్లు నకిలీవని అంటున్నారు సప్తగిరి బ్యాంక్ అధికారులు. నిధుల గోల్ మాల్ లో తమ తప్పు లేదని ఇరువర్గాలు వాదిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రెండు శాఖల అధికారులు పరస్పరం ఫిర్యాదు చేశాయి. భవానీపురం, ఆత్కూరు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ శాఖల అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
IOB, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఎవరు సిఫార్సు చేశారు. ఏ ఖాతాలకు నిధులు వెళ్లాయి అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఎవరు సంతకం చేస్తే నిధులు మళ్లించారనే దానిపై అంతర్గత విచారణ జరిపి సమచారం ఇవ్వాలన్నారు పోలీసులు. మారుమూల గ్రామంలోని బ్యాంకులో ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారని ఆయిల్ ఫెడ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్ ఒక్క తెలుగు అకాడమీకే పరిమితం కాలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఎఫ్‌డీలను కూడా కొల్లగొట్టేశారు కేటుగాళ్లు. తెలంగాణ పోలీసులిచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఏపీలో మరో రెండు స్కామ్స్ బయటపడ్డాయ్.
రెండు శాఖల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 15కోట్ల రూపాయలు కొట్టేసినట్టు ప్రాథమికంగా తేల్చారు. ప్రధాన నిందితుడు సాయికుమార్ అకౌంట్లలోకే ఈ అమౌంట్ వెళ్లినట్లు గుర్తించారు.
ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు 9 బ్యాంకుల్లో 34 ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఉన్నాయి. విజయవాడ భవానీపురంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 9కోట్ల 60లక్షల రూపాయలు ఉండాల్సి ఉండగా… కేవలం పన్నెండున్నర లక్షలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాంతో, అధికారులు… విజయవాడ పటమట పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఇవి కూడా చదవండి: RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..
Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..