RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే నిజంగానే చనిపోయాడా? ఆర్కే మృతిని అతని కుటుంబ సభ్యులు ఎందుకు నమ్మడం లేదు? అనారోగ్యంతో మరణిస్తే మావోయిస్ట్ పార్టీకి తెలియకుండా ఉంటుందా?
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే నిజంగానే చనిపోయాడా? ఆర్కే మృతిని అతని కుటుంబ సభ్యులు ఎందుకు నమ్మడం లేదు? అనారోగ్యంతో మరణిస్తే మావోయిస్ట్ పార్టీకి తెలియకుండా ఉంటుందా? మరి, ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు? కారణమేంటి? పోలీసులేమో ఆర్కే చనిపోయాడని అంటున్నారు. కుటుంబ సభ్యులేమో నమ్మలేమని చెప్తున్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన మావోయిస్ట్ పార్టీ నాయకత్వం మౌనంగా ఉంది. దాంతో, ఆర్కే డెత్‌పై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో మరణించాడని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు తెలిపింది. కానీ, పోలీసుల మాటల్ని తాము నమ్మలేమంటున్నారు ఆర్కే కుటుంబ సభ్యులు, బంధువులు.
ఆర్కే మృతిపై తమకింకా నమ్మకం కుదరడం లేదంటున్నారు అతని భార్య శిరీష. మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్ముతామంటున్నారు. ఒకవేళ ఆర్కే చనిపోయి ఉంటే మృతదేహాన్ని అప్పగించేలా ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.
మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్ముతామంటున్నారు ఆర్కే తోడల్లుడు, విరసం నేత కల్యాణ్‌రావు. ఆర్కే మరణించి ఉంటే మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఆర్కే డెత్ వార్తల వెనుక ప్రభుత్వం, పోలీసుల కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆర్కే సోదరుడు, బంధువులదీ ఇదే మాట. ఆర్కే డెత్‌పై క్లారిటీ రావాలంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఒక్కటే ఆధారం అంటున్నారు.
ఇదిలావుంటే.. పోలీసులేమో ఆర్కే డెడ్ అంటున్నారు. కుటుంబ సభ్యులేమో నమ్మలేమంటున్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన మావోయిస్ట్ పార్టీ ఏమో సైలెంట్‌గా ఉంది. ఇందులో ఏమైనా వ్యూహం ఉందా..? ఇది తెలియాలంటే మావోయిస్ట్ పార్టీ నుంచి అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సిందే.
ఇవి కూడా చదవండి: Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..