Student Suicide: పాఠశాల బస్ మిస్సయిందని.. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏం చేశాడంటే..?
9th Class Student Suicide: చిన్నచిన్న విషయాలకే చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుతున్నాయి. తాజాగా ఓ బాలుడు పాఠశాల బస్ మిస్సయిందని
9th Class Student Suicide: చిన్నచిన్న విషయాలకే చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుతున్నాయి. తాజాగా ఓ బాలుడు పాఠశాల బస్ మిస్సయిందని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమయానికి బస్సు అందుకోలేక పోయానని మదన పడిన బాలుడు ఉరివేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని ఆమ్దోహ్ గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమ్దోహ్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా పాఠశాలకు బయలుదేరాడు. ఈ క్రమంలో అతను బస్ పాయింట్ దగ్గరికి వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా బాధపడిన విద్యార్థి ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఘోడడోంగ్రి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రవి శక్య తెలిపారు.
అయితే బస్ వెళ్లిపోయిన తర్వాత ఇంటికి ఏడుస్తూ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెరట్లోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడని తెలిపారు. బాలుడు ఎప్పుడూ చదువులో ముందుండేవాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: