Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: గ్రామంపై దాడి చేసిన మావోయిస్టులు.. విద్యార్థిని సహా ఐదుగురి అపహరణ..

Naxals abduct 5 villagers: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సుక్మా జిల్లాలో ఐదుగురిని నక్సలైట్లు అపహరించారు. జిల్లాలోని

Chhattisgarh: గ్రామంపై దాడి చేసిన మావోయిస్టులు.. విద్యార్థిని సహా ఐదుగురి అపహరణ..
Naxals
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 08, 2021 | 9:39 AM

Naxals abduct 5 villagers: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సుక్మా జిల్లాలో ఐదుగురిని నక్సలైట్లు అపహరించారు. జిల్లాలోని కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను తమవెంట బలవంతంగా తీసుకెళ్లినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా.. గ్రామంపై ఎందుకు దాడి చేశారు.. బాధితులను ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని ఎస్పీ సునీల్‌ శర్మ వెల్లడించారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు.

సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని.. అదేకారణంతోనే తీసుకెళ్లి ఉండవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్‌ రీజియన్‌లోని గిరిజన సంఘాలు ఇప్పటికే మావోయిస్టులను కోరాయని తెలిపారు. భద్రతా దళాలు కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. కొంటా పోలీస్ స్టేషన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు.

జూలైలో నెలలో జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్ నుంచి ఎనిమిది మంది గ్రామస్థులను నక్సల్స్ అపహరించి తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం రెండు మూడు రోజుల తర్వాత విడుదల చేశారని శర్మ తెలిపారు.

Also Read:

Crime News: గొడవ అవుతుందని వెళితే.. పోలీస్ అధికారినే చితకబాదారు.. తాళ్లతో కట్టేసి దారుణంగా..

Earthquake: భూకంపంతో ఉలిక్కిపడ్డ అండమాన్‌ వాసులు.. ఇళ్ల నుంచి పరుగులు..

నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..
ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి..
ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి..
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. కన్నడ భక్తుల పాదయాత్ర
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. కన్నడ భక్తుల పాదయాత్ర
అయోధ్యలో రామ నవమి వేడుకలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
అయోధ్యలో రామ నవమి వేడుకలు.. పూర్తి షెడ్యూల్ ఇదే