Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భూకంపంతో ఉలిక్కిపడ్డ అండమాన్‌ వాసులు.. ఇళ్ల నుంచి పరుగులు..

Andaman And Nicobar Islands: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవుల్లో

Earthquake: భూకంపంతో ఉలిక్కిపడ్డ అండమాన్‌ వాసులు.. ఇళ్ల నుంచి పరుగులు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 08, 2021 | 8:35 AM

Earthquake Hits Andaman And Nicobar Islands: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 5.28 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయని.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. పోర్టుబ్లేయిర్‌కు 218 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. నిద్రమత్తులో ఉండగా ప్రకంపనలు సంభవించడంతో.. ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అంతకుముందు, ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో కూడా భూకంపం యొక్క బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఆదివారం రాత్రి 9.50 గంటలకు ఇక్కడ 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం ప్రకారం, సిక్కిం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, కాలింపాంగ్‌లలో కూడా భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూ ప్రకంపనలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల బెంగాల్, బీహార్, ఢిల్లీ, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.

Also Read:

PM Narendra Modi: అన్ని రకాలుగా ఆదుకుంటాం.. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ..

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం.. ఎంత తగ్గించారంటే..