AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్ల తర్వాత ఆయేషా డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం..స్పాట్‌కి చేరుకున్న అధికారులు

దాదాపు 12 సంవత్సరాల క్రితం విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని  ఓ ప్రైవేట్ హాస్టల్లో  ఆయేషా మీరా అనే ఫార్మశీ విద్యార్థిని  లైంగికదాడి, హత్యకు గురైంది. ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి. రాష్ట్రంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో వారు సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దోశిగా ప్రకటించింది. ఆ తర్వాత కోర్టు.. సీబీఐ చేతికి కేసును బదిలీ […]

12 ఏళ్ల తర్వాత ఆయేషా డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం..స్పాట్‌కి చేరుకున్న అధికారులు
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2019 | 7:59 AM

Share

దాదాపు 12 సంవత్సరాల క్రితం విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని  ఓ ప్రైవేట్ హాస్టల్లో  ఆయేషా మీరా అనే ఫార్మశీ విద్యార్థిని  లైంగికదాడి, హత్యకు గురైంది. ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి. రాష్ట్రంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో వారు సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దోశిగా ప్రకటించింది. ఆ తర్వాత కోర్టు.. సీబీఐ చేతికి కేసును బదిలీ చేసింది. కాగా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషని.. మాజీ మంత్రి కోనేరు రంగారావు కొడుకు, హాస్టల్ వార్డెన్, మరికొందరిపై…ఆయేషా తల్లిదండ్రులు మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్నారు.

ఈ సంచలన కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం  సీబీఐకి పెద్ద సవాల్​గా మారింది. దీంతో రీ పోస్ట్‌మార్టం చెయ్యాలని అధికారులు భావించారు. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో వారు నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.  సీబీఐ ఆయేషా తల్లిదండ్రులకు కూడా డీఎన్‌ఏ టెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు ముస్లిం మతపెద్దలు మొదట అంగీకరించలేదు. దీంతో సీబీఐ కోర్టు నుంచే పర్మీషన్ తెచ్చుకుంది. కాసేపట్లో ఆయేషా మృతదేహానికి రీపోస్ట్‌మార్టం జరగనుంది. ఆమెను ఖననం చేసిన  చెంచుపేట గ్రామానికి అధికారులు, పోలీసులు , వైద్యులు  చేరుకున్నారు. ఆ ఏరియా మొత్తాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. రీ-పోస్ట్ మార్టం మొత్తాన్నీ వీడియో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..