జీఎస్టీ ఆఫీసర్ బొల్లినేని శ్రీనివాస్‌ నివాసాల్లో సీబీఐ దాడులు

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో ఆయన నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడలోని ఆయన నివాసాల్లో అధికారులు సోదాలు జరిపి ఆయనకు రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. సుమారు పద్నాలుగేళ్ల పాటు ఈడీలో పనిచేసిన గాంధీ..ప్రస్తుత సీఎం జగన్ అక్రమాస్తుల […]

జీఎస్టీ ఆఫీసర్ బొల్లినేని శ్రీనివాస్‌ నివాసాల్లో సీబీఐ దాడులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 5:08 PM

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో ఆయన నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడలోని ఆయన నివాసాల్లో అధికారులు సోదాలు జరిపి ఆయనకు రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. సుమారు పద్నాలుగేళ్ల పాటు ఈడీలో పనిచేసిన గాంధీ..ప్రస్తుత సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు ప్రక్రియలోనూ కీలకంగా వ్యవహరించారు.

 గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని కూడా ఆయన ఆరోపణలు ఉన్నాయి.