Telangana Crime News: బర్త్ డే వేడుక‌ల్లో తల్వార్​తో కేక్​ కట్​ చేశారు.. పెద్ద త‌ల‌నొప్పే తెచ్చుకున్నారు

తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ క‌ఠినంగా కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో అతి చేసే ఆక‌తాయిల తాట తీస్తున్నారు పోలీసులు. ఓ వైపు రాత్రి...

Telangana Crime News:  బర్త్ డే వేడుక‌ల్లో తల్వార్​తో కేక్​ కట్​ చేశారు.. పెద్ద త‌ల‌నొప్పే తెచ్చుకున్నారు
Cake Cutting With Talwar
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 9:17 PM

తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ క‌ఠినంగా కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో అతి చేసే ఆక‌తాయిల తాట తీస్తున్నారు పోలీసులు. ఓ వైపు రాత్రి వేళ లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా బహిరంగ ప్రదేశంలో బ‌ర్త్ డే వేడుక నిర్వహించటమే నేరం… అలాంటిది వేడుకల్లో మారణాయుధం తల్వార్‌తో వేడుక జరుపుకున్నాడు ఓ యువకుడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ న్యూసెన్స్‌లో భాగ‌మైన‌ 14 మందిపై కేసు నమోదు చేశారు.పెగడపల్లి మండలం ఏల్లాపూర్‌ గ్రామానికి చెందిన రంగు వేణు అనే యువకుడి బర్త్ డే వేడుకను… తన ఫ్రెండ్స్‌తో బహిరంగ ప్రదేశంలో జరుపుకుని తల్వార్‌తో కేక్‌ కోశాడు. అంతేకాదు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి పెద్ద గొప్ప‌గా చెప్పుకున్నారు . వైరల్‌గా మారటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వేడుకల్లో 14 మంది పాల్గొన్నట్లు గుర్తించి… వారిపై కేసు నమోదు చేసినట్లు పెగడపల్లి ఎస్ఐ.అశోక్‌ తెలిపారు.

కాగా తెలంగాణ‌లో సాయంత్రం 6 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని పోలీసులు కోరుతున్నారు. లైట్ తీసుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Also Read: మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది.. రూ.25వేలకే మినీ ట్రాక్ట‌ర్ త‌యారు చేసిన రైతు.. భలే ఉప‌యోగ‌ప‌డుతుంది

 ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!