ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. భర్తపై మరిగే నూనె పోసిన భార్య.. కారణం అదేనా..?

కుటుంబ కలహాల కారణంగా భర్తపై మరుగుతున్న నూనెను పోసేసింది. కాలుతున్న వేడి నూనె, కారాన్ని భర్త పై చల్లిన భార్య.. తన కూతురుతో పారిపోయింది.

ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. భర్తపై మరిగే నూనె పోసిన భార్య.. కారణం అదేనా..?
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 10, 2021 | 8:11 AM

Hot Oil attack : హైదరాబాద్ మహానగర శివారులో దారుణం వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగా భర్తపై మరుగుతున్న నూనెను పోసేసింది. కాలుతున్న వేడి నూనె, కారాన్ని భర్త పై చల్లిన భార్య.. తన కూతురుతో పారిపోయింది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలంగా నగరానికి వలసవచ్చి జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో నివాసముంటున్నారు. సదయ్య కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెలలో భర్తతో గొడవపడ్డ రజిత.. తల్లిగారి ఇంటికి వెళ్లింది. పెద్దలు సర్ధిచెప్పడంతో గత వారం క్రితమే ఇంటికి తిరిగి చేరుకుంది. ఈ క్రమంలో తన భర్తకు ఆహారం సరిగ్గా పెట్టేది కాదని స్థానికులు తెలిపారు.

ఇదివుంటే, మంగళవారం యధావిధిగా వ్యాపారానికి వెళ్లిన సదయ్య మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. భార్య, కూతురు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని విచారించాడు. తీరా చూస్తే భార్య ఇంట్లో ఉన్నట్లు గుర్తించాడు. అయితే, ఎంత పిలిచిన గేట్ తెరవకపోవడంతో పక్కన ఇంటిపై నుండి తన ఇంట్లోకి వెళ్లాడు సదయ్య. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో ఆవేశానికి లోనైన భార్య రజిత భర్తపై వేడి వేడి నూనె, కారం చల్లింది. అనంతరం కూతురును తీసుకుని రజిత పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.