ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్ మహానగరంలోని బోయినపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ అడ్మిన్ బ్లాక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ మహానగరంలోని బోయినపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ అడ్మిన్ బ్లాక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో స్కూల్ రికార్డులు, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారి మంటలు అంటుకోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ పరిసర ప్రాంతం అంతా పొగలు దట్టంగా వ్యాపించాయి. పాఠశాల సిబ్బంది సమాచారంతో రెండు వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం షాక్ సర్య్కూట్ కారణంగా జరిగినట్లు అంచనా వేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




