పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

పక్కింటి వారితో గొడవ ఆ ఇల్లాలు ప్రాణం తీసింది. క్షణికావేశంలో ఆమె భర్త చేసిన ఘాతుకానికి మరో కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన రెండు దారుణ సంఘటనలతో ఆ ప్రాంతమంతా భయనకంగా మారిపోయింది.

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

పక్కింటి వారితో గొడవ ఆ ఇల్లాలు ప్రాణం తీసింది. క్షణికావేశంలో ఆమె భర్త చేసిన ఘాతుకానికి మరో కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన రెండు దారుణ సంఘటనలతో ఆ ప్రాంతమంతా భయనకంగా మారిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

బీహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజున రెండు వేర్వేరు హత్యలు జరిగాయి. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్మా గ్రామానికి చెందిన లక్మణ్ సదా, పవన్ సదా అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే పవన్‌కి లక్ష్మణ్ భార్య దేవికి మధ్య ఏదో చిన్న విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆ గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో పవన్ తన పవన్ తన కోపాన్ని ఆపుకోలేక పోయాడు. పక్కనే ఉన్న ఓ బలమైన వస్తువుతో దేవిని గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

ఈ విషయం తెలిసిన దేవి భర్త లక్ష్మణ్ పొలం నుంచి ఆవేశంగా బయల్దేరాడు. పవన్‌పై ఆగ్రహంతో అతన్ని నడిరోడ్డుపైనే నరికేసి అక్కడే వేచియున్నాడు. అదిచూసిన స్థానికులంతా భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. తన భర్యను చంపేశాడనే కోపంతోనే పవన్‌ని హత్య చేసినట్లుగా అతడు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

 

Click on your DTH Provider to Add TV9 Telugu