AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగిన మైకంలో మూడతంస్తులపై నుంచి పడి వ్యక్తి మృతి

హైదరాబాద్ మోతీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భవనంపై నుంచి జారిపడి మృతి చెందాడు.

తాగిన మైకంలో మూడతంస్తులపై నుంచి పడి వ్యక్తి మృతి
Balaraju Goud
|

Updated on: Aug 01, 2020 | 6:43 AM

Share

హైదరాబాద్ మోతీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భవనంపై నుంచి జారిపడి మృతి చెందాడు. మోతీనగర్ కు చెందిన శ్రీనివాస్ శుక్రవారం రాత్రి అతడు బాగా మద్యం సేవించాడు. బిల్డింగ్ 3వ అంతస్తు మెట్ల పక్కన ఉన్న గోడపై కూర్చొని సిగరెట్ కాలుస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతన్ని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us