Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey-trap: మాయలేడీ వలపు వలలో చిక్కుకున్న యువ పారిశ్రామికవేత్త.. పోలీసుల ఏంట్రీతో..

Honey-trap: నగరానికి చెందిన 28 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త హానీట్రాప్‌లో పడ్డారు. మాయలేడీ ముద్దు ముద్దు మాటలకు లొంగిపోయాడు.

Honey-trap: మాయలేడీ వలపు వలలో చిక్కుకున్న యువ పారిశ్రామికవేత్త.. పోలీసుల ఏంట్రీతో..
Honey Trap
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 20, 2023 | 12:16 PM

బెంగళూరులో హనీ ట్రాప్‌ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో​ఓ మహిళతో సహా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన 28 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త హానీట్రాప్‌లో పడ్డారు. మాయలేడీ ముద్దు ముద్దు మాటలకు లొంగిపోయాడు. ఆమె, ఆమె తరపు వ్యక్తుల బెదిరింపులతో భయపడ్డాడు. చివరికి అసలు నిజం గ్రహించి.. వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పుట్టేనహళ్లి పోలీసులు మెహర్‌ అనే యువతితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం వేట మొదలుపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా సదరు మహిళ యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తరచూ చాటింగ్‌ చేసుకుంటూ.. మాయమాటలతో అతనికి దగ్గరైంది. తన భర్త దుబాయ్‌లో ఉంటున్నారని, తాను సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని అతనికి కబురు పెట్టింది. తన వద్దకు రావాలంటూ.. ఏకంగా తన లొకేషన్‌ను షేర్ చేసింది. ఇదంతా నిజమని నమ్మిన యువ పారిశ్రామిక వేత్త.. ఆమెపై ఆశతో వెళ్లి కలిశాడు. ఇద్దరూ ఆమె ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని బెదిరించారు. నువ్వు సున్తీ చేయించుకోవాలని, ఆమెను వివాహం చేసుకోవాలని బెదిరించారు. తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. చివరికి వారి నుంచి ఎలాగోలా.. తప్పించుకు వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..