AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత భార్యపైనే పిస్టల్‌తో కాల్పులు జరిపిన బ్యాంక్ మేనేజర్.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..

భార్యభర్తలంటే అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉండేలా బతకాలి.

సొంత భార్యపైనే పిస్టల్‌తో కాల్పులు జరిపిన బ్యాంక్ మేనేజర్.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..
uppula Raju
|

Updated on: Dec 06, 2020 | 8:08 PM

Share

భార్యభర్తలంటే అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉండేలా బతకాలి. ఆధునిక జీవితంలో అలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. కంప్యూటర్ కాలంలో మనుషుల మధ్య బంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సమస్యలుంటే పరిష్కరించుకోకుండా చిన్నచిన్న విభేధాలతో ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సొంత భార్యనే పిస్టల్‌తో కాల్చేశాడు ఓ భర్త. వివరాల్లోకి వెళితే..

షికోహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమేష్‌నగర్ ప్రాంతంలో నివసించే ఆశారాం అనే వ్యక్తి బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. శనివారం అర్థరాత్రి మొదటి భార్యకు సంబంధించిన గొడవపై రెండో భార్య వినీత ఆయనతో వాగ్వాదానికి దిగింది. ఇలాంటి గొడవలు వీరికి మొదటిసారి కాదు. నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దీంతో రెండో భార్య వినీతపై కోపం పెంచుకున్న ఆశారం తనను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన దగ్గర ఉన్న పిస్టల్‌తో వినీతపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఆశారంపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.