ప్రియుడు మోజులో కట్టకున్న భర్తనే..! వణుకుపుట్టించే దారుణ ఘటన..
ఆస్పరి మండలంలో గొల్ల అహోబిలం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అహోబిలం భార్య గంగవతి, కర్ణాటకకు చెందిన చెన్న బసప్పతో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో బసప్ప అహోబిలంను హత్య చేశాడు. CI గంగాధర్ నేతృత్వంలోని పోలీసులు బసప్పను అరెస్ట్ చేశారు.

ఆస్పరి మండలం దొడగుండ, తొగరగల్లు గ్రామాల మధ్య ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన గొల్ల అహోబిలం హత్య కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసును ఆస్పరి CI గంగాధర్ సిబ్బందితో కలిసి ఛేదించారు. ఆస్పరి మండలం తొగరగల్లు నుంచి అహోబిలం తన భార్య గంగవతి కర్ణాటకలోని యాదగిరి జిల్లా వడిగేరి తాలూకా రత్నడిగి గ్రామం కురెండు ఏళ్ల కిందట వలస వచ్చింది.
వలస వెళ్ళిన ప్రాంతంలో కర్ణాటక లోనే చెన్న బసప్పతో మృతుడి అహోబిలం భార్య వివాహేతర బంధం పెట్టుకుంది. భార్య అక్రమ సంబంధం పై భర్త అహోబిలం పలు మార్లు గంగావతితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే దంపతులు ఇటివల సొంత గ్రామం అయిన తొగరగల్లు వచ్చారు. గంగవతి సొంత ఊరు కలపరి గ్రామంలో తన భర్త అహోబిలం భోజనం చేసి పక్కన ఉన్న తొగరగల్లు గ్రామంలో ఉండే తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్తున్నాడని, అతని భార్య గంగవతి తన ప్రియుడు బసప్పకు సమాచరం అందించింది.
రెండు రోజుల క్రితం పన్నిన పథకం ప్రకారం కర్ణాటక నుంచి తన బైక్ పై వచ్చి ఆస్పరి లో మకాం వేసిన బసప్ప, అహోబిలం పయనించే మార్గంలో కాపు కాసి ఉన్నాడు. ప్లాన్ ప్రకారం తన బైక్ లో తెచ్చుకొన్న పదునైన ఆయుధం తో అహోబిలం వెళ్ళే బైక్ ను అడ్డగించి హత్య చేసి పరారయ్యాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




