
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డుపై మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. రోడ్డు దాటుతున్నటు ఆర్మీ జవాన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న జవాన్‌ను చూసిన వాహనదారులు ఏమాత్రం మానవత్వం లేకుండా పట్టించుకోకుండా మృతదేహం పక్క నుంచే వెళ్లిపోయారు. స్థానికంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఆర్మీ జవాన్ అని తెలిసింది. గోల్కొండ ఆర్డినరీ సెంటర్లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ యూపీకి చెందినవారిగా గుర్తించారు.
యూపీకి చెందిన ఆర్మీ జవాన్ కునాల్ నెల రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చారు. గోల్కొండలోని ట్రైనింగ్ సెంటర్లో అథ్లెట్ గా పని చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నార్సింగిలోని ఎస్బిఐ బ్యాంక్‌లో పని ఉందని బయటికి వచ్చిన జవాన్ ఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళుతున్న రెడీమిక్స్ టిప్పర్ వాహనం జవాను ఢీ కొట్టింది. జవాన్ మృతి చెందడంతో టిప్పర్ వాహనం అక్కడి నుండి పరార్ అయింది. అయితే రెడీమిక్స్ డిపార్ వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. కునాల్ గోల్కొండ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఏ విధంగా ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు అనే దానిపై ఆర్మీ అధికారులకు పోలీసులు ఆయా మార్గాల సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి సమాచారం సేకరించనున్నారు. పోస్టుమార్టం అనంతరం జవాన్ కునాల్ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..