AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురికి పాజిటివ్.. తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తులు..!

Radisson Drugs Party Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.. ఈ కేసులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీ జరిగిన తర్వాత రోజే టెస్ట్ చేయడంతో ఈ ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. యూరిన్ శాంపిల్స్‌లో మరో ఆరుగురికి నెగిటివ్ గా నిర్ధారించారు. పార్టీ జరిగిన వారం తర్వాత విచారణకు రావడంతోనే నెగిటివ్ వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురికి పాజిటివ్.. తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తులు..!
Radisson Drugs Case
Shaik Madar Saheb
|

Updated on: Mar 05, 2024 | 4:36 PM

Share

Radisson Drugs Party Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.. ఈ కేసులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీ జరిగిన తర్వాత రోజే టెస్ట్ చేయడంతో ఈ ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. యూరిన్ శాంపిల్స్‌లో మరో ఆరుగురికి నెగిటివ్ గా నిర్ధారించారు. పార్టీ జరిగిన వారం తర్వాత విచారణకు రావడంతోనే నెగిటివ్ వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డైట్ పాటించడంతో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ వచ్చిన వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదా.. లేదంటే దొరక్కుండా జాగ్రత్త పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్లలో కొంత మంది విచారణకు వెంటనే రాకుండా పలు కారణాలు చూపించి జాప్యం చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు విచారణకు వస్తున్నారు. అయితే ఈలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని.. అధికారుల ముందు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.

వారం తర్వాత బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ఇవ్వడంతో నెగిటివ్ వస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరి అధికారులు అనుమానిస్తున్నట్టు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే వాళ్ల రిపోర్ట్‌లు నెగిటివ్ వచ్చాయా.. లేదంటే సదరు నిందితులు డ్రగ్స్ తీసుకోలేదా.. అనేది తేలాల్సి ఉంది.

అయితే, అధికారులకు దొరక్కుండా నిందితులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెయిర్ శాంపిల్స్‌లో బయట పడకుండా హెయిర్ డై .. గోళ్లకు పెడిక్యూర్ చేసుకుని నిందితులు విచారణకు వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం కలకలం రేపుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..