AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైకు తగలబెట్టి.. బ్రొటన వేలు తీసుకెళ్లి.. చేతబడి ముసుగులో హత్య..

అనుమానం పెనుభూతమై వెంటాడింది. తన తండ్రి చావుకు చేతబడే కారణమని బలంగా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. చేతబడి చేసిన అతని అడ్డు తొలగించుకునేందుకు సుఫారీ మాట్లాడుకున్నాడు. మూడు లక్షల రూపాయల కాంట్రాక్ట్ మర్డర్‎లో మూప్పై వేల రూపాయలు బదిలీ అయ్యాయి. అయితే చేతబడి మాంత్రడికుడిది హత్యగా భావించిన పోలీసులు ఎట్టకేలకు హంతకుడిని గుర్తించి పట్టుకున్నారు. అది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మాలపాడు. లంబాడీ సామాజిక వర్గం వారు అధికంగా నివసించే గ్రామంలో తులసీ నాయక్ చిన్న చిన్న పూజలు చేసేవాడు.

బైకు తగలబెట్టి.. బ్రొటన వేలు తీసుకెళ్లి.. చేతబడి ముసుగులో హత్య..
Palnadu District
T Nagaraju
| Edited By: Srikar T|

Updated on: Mar 05, 2024 | 10:32 AM

Share

అనుమానం పెనుభూతమై వెంటాడింది. తన తండ్రి చావుకు చేతబడే కారణమని బలంగా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. చేతబడి చేసిన అతని అడ్డు తొలగించుకునేందుకు సుఫారీ మాట్లాడుకున్నాడు. మూడు లక్షల రూపాయల కాంట్రాక్ట్ మర్డర్‎లో మూప్పై వేల రూపాయలు బదిలీ అయ్యాయి. అయితే చేతబడి మాంత్రడికుడిది హత్యగా భావించిన పోలీసులు ఎట్టకేలకు హంతకుడిని గుర్తించి పట్టుకున్నారు. అది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మాలపాడు. లంబాడీ సామాజిక వర్గం వారు అధికంగా నివసించే గ్రామంలో తులసీ నాయక్ చిన్న చిన్న పూజలు చేసేవాడు. అమ్మవారు ఒంటికి మీదకి వచ్చినప్పుడు స్థానికులు, చుట్టుప్రక్కల వాళ్లు వచ్చి అంత్రాలు, తాయోత్తులు కట్టించుకునే వాళ్లు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో తులసీ నాయక్ వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇది ఇలా ఉండగానే గ్రామంలో అతని పూజల పట్ల అనుమానాలు మొదలయ్యాయి. చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే గ్రామానికే చెందిన శివా నాయక్ తండ్రి సీతా నాయక్ అనారోగ్యం బారిన పడ్డాడు. వైద్యం చేయించిన సీతా నాయక్ బ్రతికి బట్టకట్టలేదు. దీంతో సీతా నాయక్‎ను తులసీ నాయక్కే చేతబడి చేసి చంపేశాడన్న వదంతలు మొదలయ్యాయి. వాటినే శివా నాయక్ బలంగా నమ్మాడు. తన తండ్రి చావుకు కారణమైన తులసీ నాయక్ అడ్డు తొలంగించుకోవాలనుకున్నాడు. వెంటనే బొల్లాపల్లికి చెందిన గంగిరెడ్డి నాగిరెడ్డిని సంప్రదించాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు తులసీ నాయక్ భూమ్మీద ఉండటానికి వీల్లేదన్నాడు. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగాడు. తన పొలంలో పనిచేసి గంగులపాలెంకు చెందిన రామాంజినేయులకు విషయం చెప్పాడు. దీంతో రామాంజినేయులు తనకు బంధువైన కాకినాడకు చెందిన గంగను పిలిపించారు.

తులసీ నాయక్ అడ్డు తొలగించాలని అందరూ కలిసి గంగకు చెప్పారు. తులసీ నాయక్‎ను హత్య చేస్తే మూడు లక్షల రూపాయలు ఇస్తామని గంగకు చెప్పారు. మొదటి విడతలో ముప్పై వేల రూపాయలు కూడా ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన గంగ అగ్ని గుండాల వద్ద పొలానికి నీరు పెట్టి వస్తున్న తులసీ నాయక్‎పై అటాక్ చేశాడు. కర్రతో కొట్టి చంపాడు. తులసీ నాయక్ బైక్‎ను పెట్రోలు పోసి తగులబెట్టాడు. అంతేకాకుండా తులసీ నాయక్ బ్రోటన వ్రేలు కూడా తీసుకెళ్లిపోయాడు. దీంతో పోలీసులకు ఇది చేతబడి హత్య అన్న అనుమానం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి అనుమానం ఉన్న వారందరిని ప్రశ్నించారు. ఈక్రమంలోనే అందరి వేళ్లు శివా నాయక్ వైపు చూపించాయి. దీంతో శివా నాయక్‎ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగానే సుఫారీ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. శివా నాయక్ ఇచ్చిన సమాచారంతో గంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజాన్ని కక్కించారు. ఆ తర్వాత అతన్ని అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. చేతబడి వంటివి లేవని అవన్నీ మూఢనమ్మకాలేనని వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ చెప్పారు. అటువంటి అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్చంద సంస్థలతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!