విశాఖ ‘షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌ట‌న’‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

విశాఖప‌ట్నంలోని హిందూస్థాన్‌ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది కూలీలు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. జిల్లా క‌లెక్ట‌ర్, విశాఖ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌ను త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను..

  • Updated On - 3:24 pm, Sat, 1 August 20 Edited By:
విశాఖ 'షిప్ యార్డు ప్ర‌మాద ఘ‌ట‌న'‌పై సీఎం జ‌గ‌న్ ఆరా..

విశాఖప‌ట్నంలోని హిందూస్థాన్‌ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది కూలీలు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. జిల్లా క‌లెక్ట‌ర్, విశాఖ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌ను త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక షిప్ యార్డు ప్ర‌మాదంలోని క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. లోడ్ టెస్టింగ్ చేస్తుండగా..భారీ క్రేన్ బెర్త్‌పై కూలిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. విరిగిపడిన క్రేన్ కింద మరికొంతమంది ఉన్నారని అనుమానిస్తున్నారు.

Read More:

‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం