ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయగిరి జిల్లా నుంచి యూపీలోని వారణాసికి వెళ్తున్న ఓ లారీని పోలీసులు..

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయగిరి జిల్లా నుంచి యూపీలోని వారణాసికి వెళ్తున్న ఓ లారీని పోలీసులు చెక్ చేశారు. ఉల్లిగడ్డ బస్తాల లోడ్‌తో ఉన్న ఆ లారీని పూర్తిగా తనిఖీలు చేయగా.. అందులో పెద్ద ఎత్తున గజాయి బస్తాలు కూడా బయటపడ్డాయి. మొత్తం వెయ్యి కిలోలకుపైగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానంతో వస్తుండగా లారీని తనిఖీలు చేపట్టామన్నారు. అందులో ఉల్లిగడ్డ బస్తాలతో పాటుగా 1,056 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందన్నారు. లారీలోఉన్న ఇద్దరు నిందితులు నిఖిల్‌ కుమార్, అనురాగ్‌ కుమార్‌ అనే ఇద్దర్ని అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu