కృష్ణా జిల్లాలో దారుణం.. అత్త మామలను గొంతు కోసి చంపిన అల్లుడు.. ఇందుకు సహకరించిన కూతురు..!

సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని బంధాలు ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తి కోసం ఆ యువ జంట అమానుషానికి పాల్పడింది. అల్లుడే ఆ వృద్ధ దంపతుల పాలిట కాలయముడయ్యాడు. అస్థి కోసం అత్తామామలను హతమార్చిన ఆ కిరాతకుడికి అతని భార్య స్వయాన వారి కూతురే సహకరించింది.

కృష్ణా జిల్లాలో దారుణం.. అత్త మామలను గొంతు కోసి చంపిన అల్లుడు.. ఇందుకు సహకరించిన కూతురు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 17, 2020 | 5:18 PM

సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని బంధాలు ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తి కోసం ఆ యువ జంట అమానుషానికి పాల్పడింది. అల్లుడే ఆ వృద్ధ దంపతుల పాలిట కాలయముడయ్యాడు. అస్థి కోసం అత్తామామలను హతమార్చిన ఆ కిరాతకుడికి అతని భార్య స్వయాన వారి కూతురే సహకరించింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట మండలం బండిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కోటా ముత్తయ్య (70), సుగుణమ్మ (50) దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే, ముత్తయ్య, సుగుణమ్మకు ముగ్గురి సంతానంలో చివరి కుమార్తె మనీషా. అదే ఊరిలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న నెమలిబాబును ప్రేమించి పెళ్లికి సిద్ధమైంది. ఇందుకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. ఇదే విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.

ఎట్టకేలకు రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. ఈ సమయంలో రూ.మూడు లక్షలు కట్నం డిమాండ్‌ చేశారు. రూ.1.50 లక్షలు ఇస్తారని పెద్ద మనుషులు రాజీ కుదర్చడంతో నాలుగు నెలల క్రితం నెమలిబాబు, మనీషాల వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం ఇవ్వకపోవడంతో సొమ్ము కోసం అత్తమామలపై అల్లుడు గొడవ పడేవాడు. ఇదే క్రమంలో రూ.50 వేలకు మించి ఇవ్వలేనని ముత్తయ్య తేల్చి చెప్పేశాడు. వృద్ధులిద్దరిపై కోపం పెంచుకున్న ఆ జంట నాలుగు రోజుల క్రితం వారింటికి చుట్టపుచూపుగా వచ్చారు. బుధవారం గాఢ నిద్రలో ఉన్న అత్తమామలను కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. వృద్ధుల మధ్యలో నిద్రిస్తున్న నాలుగేళ్ల మనుమరాలు సమీపంలోని బంధువులను పిలుచుకురాగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరిని చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.