ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ.. సమయస్పూర్తితో యువతిని కాపాడిన పోలీసులు..

ప్రజా రక్షణలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో ఆపదలో ఉన్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ.. సమయస్పూర్తితో యువతిని కాపాడిన పోలీసులు..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 3:23 PM

ప్రజా రక్షణలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో ఆపదలో ఉన్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడాడు. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాగరాణి(30) అనే మహిళకు కొన్నేండ్ల క్రితం జిల్లాలోని మేనూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో నాగరాణికి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ గ్రామానికి చెందిన వెంకాగౌడ్‌తో పరిచయం ఏర్పడింది.

అయితే, భర్త నుంచి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని నాగరాణిని, వెంకాగౌడ్ నమ్మించి గత ఆరేళ్లుగా కాంజీపూర్ తండాలో ఆమెతో సహజీవనం చేశాడు. మూడేళ్ల పాటు సజావుగా సాగిన వారి సహజీవనంలో గొడవలు మొదలయ్యాయి. మూడేళ్ల నుంచి నాగరాణిని వదిలించుకోవాలని ప్రయత్నిస్తుండడంతో ఆమె పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. పైగా పెద్దల అండదండలు ఉన్నాయంటూ వెంకాగౌడ్ బెదిరింపులకు పాల్పడుతుండటంతో నాగరాణి విసిగిపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగరాణి గురువారం ఆత్మహతాయాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. సమయానికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.