AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Cheating: ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకున్నేప్పుడు అపరిచితుల సహాయం తీసుకుంటున్నారా.? అయితే ఓ సారి ఈ న్యూస్‌ చదవండి.

ATM Cheating: ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా ఏటీఎమ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, బ్యాంకులు కూడా...

ATM Cheating: ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకున్నేప్పుడు అపరిచితుల సహాయం తీసుకుంటున్నారా.? అయితే ఓ సారి ఈ న్యూస్‌ చదవండి.
Atm Cheating
Narender Vaitla
|

Updated on: Jul 26, 2021 | 11:18 AM

Share

ATM Cheating: ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా ఏటీఎమ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, బ్యాంకులు కూడా ఏటీఎమ్‌ సేవలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో అందరూ ఏటీఎమ్‌లలోనే డబ్బులను విత్‌డ్రా చేస్తున్నారు. అయితే ఏటీఎమ్‌లో డబ్బులు ఎలా తీయాలో తెలియక లేదా ఏదైనా టెక్నికల్‌ సమస్య వచ్చినప్పుడు అదే ఏటీఎమ్‌లో ఉన్న వారిని కాస్త సహాయం చేయండని అడుగుతుంటాం. అయితే ఆ సహాయం చేసే వారిలో అందరూ మంచి వాళ్లే ఉంటారనుకోవడం మీ భ్రమే అవుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటనే దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చిలకలూరి పేట, గణపవరానికి చెందిన తాపీ మేస్రీ శీనివాసరావు తన దగ్గర పనిచేసే కార్మికుడు శివ శంకర్‌కు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రమ్మని చెప్పాడు. దీంతో చిలకలూరిపేట ఎన్‌ఆర్జీ దగ్గర ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించాడు శివ శంకర్‌. కానీ కార్డు ఎంతకూ పనిచేయలేదు. దీంతో పక్కనే ఉన్న ఓ యువకుడు తాను సహాయం చేస్తానని కార్డు ఇచ్చాడు. పిన్‌ నెంబర్‌ చెప్పగానే డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటించి.. కార్డు మార్చేసి శివ శంకర్‌కు ఇచ్చాడు. ఆ కార్డు తాను ఇచ్చిందో కాదో కూడా తెలుసుకోకుండా శివ శంకర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం రాత్రి శ్రీనివాసరావుకు తన అకౌంట్‌ నుంచి మొత్తం మూడు ట్రాన్సాక్షన్లలో కలిపి రూ. 26,300 విత్‌డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో కంగుతున్న శ్రీనివాసరావు ఏం జరిగిందో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే ఊరికి చెందిన సుభాని అనే వ్యక్తి కూడా శనివారం అదే ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. శివ శంకర్‌కు లాగే సుభానికి కూడా సాయం చేస్తానని సదరు యువకుడు కార్డు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఈ విషయాన్ని గుర్తించిన సుభాని ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఇంతకు ముందు ఎంత మందిని ఇలా మోసం చేశాడన్న దానిపై విచారణ చేపట్టారు పోలీసులు.

Also Read: ‘ప్రకృతి లేనిదే లైఫ్ లేదు’.. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించక ముందు ఆమె చేసిన ట్వీట్

Accident: కిక్కు తలకెక్కింది… బైక్స్‌ను వరసగా గుద్దుకుంటూ వెళ్లాడు.. షాకింగ్ విజువల్స్

Suicide: ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. పెళ్లైన నెల రోజులకే కానరాని లోకలకు..