Mother Cheating: జూదంలో నష్టపోయిన కొడుకు.. అతన్ని ఆదుకునేందుకు ఓ తల్లి ఏకంగా 24 మందిని..
Mother Cheating: ఏ తల్లి అయినా సరే తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే చూడలేరనే సత్యం. అయితే ఇక్కడ ఓ తల్లి..

Mother Cheating: ఏ తల్లి అయినా సరే తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే చూడలేరనే సత్యం. అయితే ఇక్కడ ఓ తల్లి తన కొడుకుని అప్పుల ఊబిని రక్షించేందుకు భారీ మోసానికే పల్పడింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 24 మందిని మోసం చేసి రూ. 2 కోట్లు కొట్టేసింది. అసలు విషయంలోకి వెళితే… మహారాష్ట్రలోని ముంబైకి చెందిన రూపాల్ పాండ్య అనే మహిళకు కొడుకు ఇషాన్ ఉన్నాడు. రూపాల్ పాండ్య బ్యూటీ పార్లర్ నడుపుతూ ముంబైలోనే జీవనం సాగిస్తుండగా.. ఆమె కొడుకు ఇషాన్ ఓ మహిళను పెళ్లి చేసుకుని దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. అయితే ఇషాన్‌కి భారీ స్థాయిలో డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడటడం, బెట్టింగ్‌లు పెట్టడం వంటి వ్యసనాలు ఉన్నాయి. ఇందుకోసం భారీగా అప్పులు కూడా చేసేవాడు. ఈ క్రమంలో ఓసారి జూదంలో ఓడిపోయి రూ. 2 కోట్లు కోల్పోయాడు. దాంతో అతను పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
విషయం తెలుసుకున్న ఇషాన్ తల్లి.. తన కొడుకును కష్టాల నుంచి బయటపడేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో భారీ పథకమే వేసింది. ముందుగా తన బ్యూటీ పార్లర్‌కు వచ్చే కస్టమర్లతో సాన్నిహిత్యం పెంచుకునేది. అలా వారు దగ్గరయ్యాక.. ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మించి వారి దగ్గర అప్పుకు డబ్బులు తీసుకునేది. ఇలా చాలా మంది వద్ద అప్పులు తీసుకుని కొడుకుకు పంపించేది. అయితే తీసుకున్న అప్పులు మాత్రం చెల్లించేది కాదు. దాంతో రూపాల్‌కు అప్పు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 24 మంది ఆమెపై ఫిర్యాదు చేయగా, వారందరి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లకు పైగా డబ్బులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రూపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Also read:
All India Trinamool Congress: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది… బీజేపీ నేత సువేందు…
BCCI: టీమిండియా క్రికెటర్లకూ కోవిడ్ వ్యాక్సిన్.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న బీసీసీఐ..




