Road Accident: మరో పసిపాప ప్రాణాలను మింగేసిన స్కూల్ బస్సు.. మూడేళ్ల చిన్నారి మృతి..
మన చుట్టూ నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మనసును కలిచివేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో బైక్‌పై నుంచి కింద పడిన పసిపాపను స్కూల్ బస్సు తొక్కేయడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డుపై గుంతల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదంతో ఆ కుటుంబం ఇంట, కంట తీవ్ర శోకం మిగిల్చింది. ఈ సంఘటన జరిగిన నెలల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకుంది.
మన చుట్టూ నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మనసును కలిచివేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో బైక్‌పై నుంచి కింద పడిన పసిపాపను స్కూల్ బస్సు తొక్కేయడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డుపై గుంతల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదంతో ఆ కుటుంబం ఇంట, కంట తీవ్ర శోకం మిగిల్చింది. ఈ సంఘటన జరిగిన నెలల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషణ్ పరిధిలో జరగడం గమనార్హం.
తన సోదరుడికి తోడుగా వెళ్తూ స్కూల్ బస్సు వద్దకు చేరుకుంది మూడేళ్ల చిన్నారి భవిష్య. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడిపోయింది. ఈ విషయం తెలియకుండా డ్రైవర్ బస్సు ముందుకు వెళ్ళడంతో బస్సు చక్రాల కింద నలిగి చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది. చిన్నారి పొరపాటా.. డ్రైవర్ తప్పిదమా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..