AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rape Case: ఇదేక్కడి దారుణం..అత్యాచారం కేసు పెట్టినందుకు ఓ టీచర్‌ని కిడ్నాప్ చేశారు..

స్కూల్ మేనేజర్ భర్త తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన ఉపాధ్యాయురాలిన గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఈ దారుణ ఘటన

Rape Case: ఇదేక్కడి దారుణం..అత్యాచారం కేసు పెట్టినందుకు ఓ టీచర్‌ని కిడ్నాప్ చేశారు..
Police
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2022 | 8:09 PM

Share

Rape Case: ఇదేక్కడి దారుణం..అత్యాచారం కేసు పెట్టినందుకు ఓ టీచర్‌ని కిడ్నాప్ చేశారు.. స్కూల్ మేనేజర్ భర్త తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన ఉపాధ్యాయురాలిన గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది. బాధిత మహిళ కనిపించకుండా పోయిందని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించగా…

ఉత్తరప్రదేశ్‌లోని తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఏదో పని నిమిత్తం ఉపాధ్యాయురాలిని షాజహాన్‌పూర్‌కు తీసుకెళ్లి హోటల్‌లో అత్యాచారం చేశాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని, వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ నిందితులు ఆమెను పదేపదే చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం జరిగిన విషయాన్ని మహిళ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయినా బెదిరించి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు సదరు మహిళను ఆమె ఇంట్లోనుంచే కిడ్నాప్‌ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. పలు సెక్షన్ల కింద బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రైం న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి