Fish Attack: చేపలు పట్టేందుకు వెళ్లిన మహిళను పొడిచి చంపేసిన సెయిల్ ఫిష్..!
Fish Attack: ఒక్కోక్కరికీ ఒక్కోటి ఇష్టం ఉంటుంది. కొందరికీ పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం ఇష్టం ఉంటే.. మరికొందరికీ వంటలు చేయటం ఇష్టం. ఇంకొందరికీ కొన్నిరకాల ఆటలు ఆడటం ఇష్టం. అయితే, ఇక్కడ ఫిషింగ్ అంటే ఇష్టమున్న 73 ఏళ్ల మహిళ తన ఇద్దరు మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లింది..కానీ, పాపం ఆ చేప దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదాకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేదు..కానీ, వార్త నిజమే… […]
Fish Attack: ఒక్కోక్కరికీ ఒక్కోటి ఇష్టం ఉంటుంది. కొందరికీ పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం ఇష్టం ఉంటే.. మరికొందరికీ వంటలు చేయటం ఇష్టం. ఇంకొందరికీ కొన్నిరకాల ఆటలు ఆడటం ఇష్టం. అయితే, ఇక్కడ ఫిషింగ్ అంటే ఇష్టమున్న 73 ఏళ్ల మహిళ తన ఇద్దరు మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లింది..కానీ, పాపం ఆ చేప దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదాకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేదు..కానీ, వార్త నిజమే… తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో 73 ఏళ్ల కేథరీన్ అనే వృద్ధురాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లింది. ఫ్లోరిడాకు సమీపంలోని స్టువర్ట్ తీరానికి వీళ్లు వెళ్లారు. అక్కడ చేపలు పట్టేందుకు గాలం వేసి ఎదురు చూశారు.
కాసేపటి తర్వాత వారి గాలానికి ఏదో బరువైన చేప పడిందని వారికి అర్థమైంది. దాంతో వారు మెల్లిగా గాలాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించారు…గాలం బరువెక్కింది..ఎందుకంటే..అక్కడ పడింది..మామూలు చేప కాదు.. 45 కిలోల బరువు ఉన్న సెయిల్ ఫిష్. దీంతో, తాము పడ్డ కష్టానికి పెద్ద ఫలితమే దక్కిందని ఆ మహిళలు ఆనందపడ్డారు. దాన్ని తీసుకొని హ్యాపీ ఇంటికి వెళ్దామని అనుకున్నారు.ఆ చేపను ఫిషింగ్ ట్రైలోకి వేయడం కోసం పైకి లాగారు. అప్పుడు అది అనూహ్యంగా వారిపై దాడి చేసింది. గాలం నుంచి తప్పించుకోవడం కోసం ఆ మహిళలపై దాడి చేసింది. ఆ చేప దాడి చేస్తుందని ఆ మహిళలు ఏమాత్రం ఊహించలేకపోయారు. ఈ దాడిలో 73 ఏళ్ల కేథరిన్ పెర్కిన్స్ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో, స్నేహితులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
సముద్ర పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం..సెయిల్ ఫిష్ అనేది అత్యంత వేగవంతమైన చేపజాతుల్లో ఒకటి. సముద్ర అడుగు భాగాన సంచరించే ఈ చేప.. సుమారు 100 కేజీల వరకు బరువు పెరుగుతాయి. అలాగే 6 నుంచి 11 అడుగుల మధ్య పొడవు ఉంటాయి. పొడవైన ముక్కు కలిగి ఉంటాయి. అత్యంత బలంగా దాడి చేస్తుంది. దీని ముక్కు కత్తి ఆకారంలో పొడవుగా ఉంటుంది. శతృవుల్ని దాంతోనే ఎటాక్ చేస్తుంది. మహిళపై కూడా అలాగే ఎటాక్ చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి