AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి మరణం తట్టుకోలేక..ఓ యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు అతడు ఓ సెల్ఫీ వీడియో...

తల్లి మరణం తట్టుకోలేక..ఓ యువకుడు
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 17, 2020 | 2:28 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు అతడు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన స్నేహితులకు షేర్ చేశాడు. అమ్మ దూరం అయ్యాక తాను పడుతున్న భాదనంతా ఆ వీడియోలో చెప్పుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లు సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాకేష్ తల్లి ఏడాది క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. కాగా, రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఉన్న ఊరికి దూరంగా ఉన్నప్పటికీ అమ్మ మరణం తట్టుకోలేక పోయాడు.. పదే పదే అమ్మ జ్ఙాపకాలతో గడుపుతూ ఉండేవాడు. ఊరికి దూరంగా ఉండలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులను కలిసి తన తల్లి లేని లోటు గురించి గుర్తు చేసుకుంటూ మనో వేదనకు గురయ్యాడు. ఊరి శివార్లలోని బిక్కవాగు వద్ద తన తల్లిని దహనం చేసిన చోటుకి వెళ్లాడు. అక్కడే సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే లోపే రాకేష్ చనిపోయాడు.

ఆత్మహత్యకు ముందు రాకేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపాడు. వీడియోలో…‘‘అమ్మా కలలోకి వస్తున్నావ్…నీ దగ్గరకే వస్తున్నా’ ..మిస్ యూ రమ్య, డాడీని బాగా చూసుకో. నాన్న నువ్వు కూడా తాగుడు పెట్టకు. రమ్యను బాగా చూసుకో.. మంచిగా పెళ్లి చెయ్. నేను చనిపోయాక ఏడ్వకండి. ఉంటా’’ అని రాకేష్ సెల్ఫీ వీడియోలో అన్నాడు. ‘ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని కుటుంబ సభ్యులను కోరాడు.

Follow Us
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి