AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్..

సాధారణంగా ఇప్పుడు ఓటీటీ వేదికలలో సినిమాలు చూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిత్యం ఏదోక కొత్త కొత్త కంటెంట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక హారర్ థ్రిల్లర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

Cinema : ఒంటరిగా చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. 3 ఓటీటీల్లో దుమ్మురేపుతున్న హారర్ థ్రిల్లర్..
Trikala Movie
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 5:20 PM

Share

హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికలలో ఇలాంటి జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక హారర్ థ్రిల్లర్ మూవీ నెట్టింట తెగ వైరలవుతుంది. ఆ సినిమా పేరు త్రికాల. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 28న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఒకేసారి మూడు ప్లాట్ ఫామ్ లలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. తెలుగు, తమిళం భాషలలోనూ ఈ సినిమా స్ట్రమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా.. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధిక శ్రీనివాస్ నిర్మించారు. యానిమల్ సినిమాకు సంగీతం అందించిన హర్షవర్దన్ రామేశ్వర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక బీజీఎమ్ మే ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా మూడు ఓటీటీలలో దూసుకుపోతుంది. ఇందులో హీరోయిన్ శ్రద్ధా దాస్, సీనియర్ నటి ఆమని, ప్రభాకర్, రవి వర్మ, సాహితి, నటుడు అజయ్ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

కథ విషయానికి వస్తే.. రాజ వంశీకుల కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడే ఒక భయంకరమైన శాపం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ వంశంలో పుట్టిన వైతరణ్ (అజయ్) పుట్టుకతోనే సూర్యరశ్మిని చూడలేని వింత స్థితిలో జన్మిస్తాడు. వెలుగును భరించలేక చీకటి గదికే పరిమితమవుతాడు. అతడిని తన సవతి తల్లి ఆమని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అతడికి చికిత్స అందించేందుకు డాక్టర్ మాయ (శ్రద్ధా దాస్) రంగంలోకి దిగుతుంది. అయితే శంకరపల్లిలో ఉండే పురాతన కాటేరమ్మ ఆలయానికి, రాజవంశానికి ఉన్న లింక్ ఏమిటీ.. శివ (మహేంద్రన్), నిధి (సాహితి) జీవితాల్లో ఏం జరిగింది అనేది త్రికాల సినిమా. ప్రస్తుతం ఈ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!