Bow and Arrow Attack: దారుణం.. బాణాలతో దాడి చేసి 5 గురిని చంపేశాడు.. ప్రాణాపాయంలో ఇద్దరు!
నార్వేజియన్ నగరమైన కాంగ్‌స్‌బర్గ్‌లో, బుధవారం మధ్య రాత్రి ఒక వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో 5 మంది ప్రాణాలు కోల్పోగా, 2 మంది గాయపడ్డారు.
Bow and Arrow Attack: నార్వేజియన్ నగరమైన కాంగ్‌స్‌బర్గ్‌లో, బుధవారం మధ్య రాత్రి ఒక వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో 5 మంది ప్రాణాలు కోల్పోగా, 2 మంది గాయపడ్డారు. పోలీసుల ప్రకారం, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు, అయితే అతని గురించి లేదా ఈ సమయంలో మరణించిన వారి గురించి సమాచారం పోలీసులు ఇవ్వలేదు. బహుళ ప్రదేశాలలో దాడులు ‘ది మిర్రర్’ లో వచ్చిన నివేదిక ప్రకారం, దాడి చేసిన వ్యక్తి కూపే ఎక్స్‌ట్రా సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి వ్యక్తులపై దాడి చేశాడు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. నార్వే చాలా ప్రశాంతమైన దేశంగా పరిగణిస్తారు. ఇక్కడ అలాంటి దాడులు సాధారణంగా జరగవు. ఇది ఉగ్రవాదమా..లేక పరస్పర శత్రుత్వమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
కాంగ్‌స్‌బర్గ్ పోలీస్ చీఫ్ ఒవింద్ ఆస్ మాట్లాడుతూ – ”దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీని కంటే ఎక్కువ సమాచారం ప్రస్తుతానికి ఇవ్వలేము. నిందితుడు ఒంటరిగా దాడులు చేశాడు. కొంతమంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అయితే వీటి వివరాలు ఇంకా తెలియలేదు.” అని చెప్పారు.
దాడి చేసిన వ్యక్తి నగరం మధ్యలో ఉన్నాడు. ఆస్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మొదట నగరంలోని రద్దీ కూడలిలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత అతను సమీప ప్రాంతాల వైపు పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించారు. ఈ ఘటనపై న్యాయశాఖ మంత్రి మోనికా మిల్లండ్‌కు సమాచారం అందించారు.
నిందితులను వెంబడించడానికి పోలీసులు హెలికాప్టర్లు , బాంబు స్క్వాడ్‌లను కూడా మోహరించారు. ఘటనా స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రెమెన్ ప్రాంతం నుంచి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో అతను పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించాడు.
ఇవి కూడా చదవండి: Provident Fund: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు ముందే పీఎఫ్ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!
BMW C400GT: భారత మార్కెట్లోకి బీఎమ్‌డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..