Crime News: కోడి గుడ్డు ప్రాణం తీసిందంటే నమ్ముతారా..! పాపం ఆమె ఊపిరి అలానే ఆగిపోయింది..
Crime News: అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత ఉంది. అయితే అరటి పండు తింటే పన్ను ఎలా విరుగుద్ది అనే ప్రశ్న వస్తుంది. కానీ.. సమాజంలో జరిగే కొన్ని..
Crime News: అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత ఉంది. అయితే అరటి పండు తింటే పన్ను ఎలా విరుగుద్ది అనే ప్రశ్న వస్తుంది. కానీ.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించక మానదు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు కోల్పోయే సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ (50) అనే మహిళ భోజనం చేసే సమయంలో కోడి గుడ్డు కూడా తీసుకుంది. అయితే కోడి గుడ్డును ఒకేసారి నోట్లో పెట్టుకోవడంతో ఒక్కసారిగా గొంతులోకి జారి పోయింది. గుడ్డు ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఆ మహిళ అక్కడిక్కడే పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మహిళ గొంతులోని గుడ్డుని బయటకు తీయడానికి ప్రయత్నించేలోగా మృతి చెందింది.
Also Read: Garuda Puranam: ఈ 5 విషయాలు పాటిస్తే.. మీ జీవితంలో ఎలప్పుడూ ఇబ్బందులు ఉండవట.!
Pelli SandaD: పెళ్లిసందD నుంచి రాఘవేంద్ర రావు మార్క్‌లో మరో రొమాంటిక్ సాంగ్….