Maharashtra: 29 కాదు.. మృగాళ్ళా తెగబడింది 33 మంది.. మహారాష్ట్ర ఘటనలో షాకింగ్ ఫ్యాక్ట్స్.!
మహారాష్ట్రలో ఠానేలో జరిగిన అత్యాచార ఘటనలో మరింత షాకింగ్ అప్‌డేట్ ఇది. బాధిత బాలికపై కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 33 మంది సామూహిక

Maharashtra: మహారాష్ట్రలో ఠానేలో జరిగిన అత్యాచార ఘటనలో మరింత షాకింగ్ అప్‌డేట్ ఇది. బాధిత బాలికపై కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 33 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నట్టు తేలింది. ఈ ఘోరానికి పాల్పడ్డ వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. బాధితురాలు బుధవారం రాత్రి డోంబివాలిలో మాన్పాడ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితుడు బాలిక స్నేహితుడే కావడం గమనార్హం.
జనవరిలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో తీశాడా నీచుడు. వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తూ మిగతావారు బాధితురాలిపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 33 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు.
చట్టాలెన్ని వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేదు. బాలిక అన్న కనికరం లేదు.. ఒళ్లు మరిచి అత్యాచారానికి బరితెగిస్తున్నారు మానవ మృగాళ్లు. అమానుషం.. అంతకుమించిన ఘోరం.. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. మహారాష్ట్ర థానేలో జరిగిన ఈ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది.
14 ఏళ్ల బాలికపై ఏకంగా 33 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అత్యాచారాన్ని వీడియోలు కూడా తీశారు కామాంధులు. ఈ ఘటన థానే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 26 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Read also: Kidnap: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కలకలం.. ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసిన దుండగులు