గజ్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సిన వాహనమే.. ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది..
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సిన వాహనమే.. వారి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పిన 104 వాహనం ముగ్గురు..
104 Vehicle Accident: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సిన వాహనమే.. వారి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పిన 104 వాహనం ముగ్గురు వ్యక్తులను ఆస్పత్రులపాలు చేసింది. వివరాల్లోకెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో జాలిగామ గ్రామానికి 104 వాహనం వచ్చింది. ఎప్పటిలాగే మందుల పంపిణీ కోసం వైద్యసిబ్బంది ఆ వాహనంలో గ్రామానికి వచ్చారు. అయితే 104 వాహనం నడిపే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు వాహనం నడిపిన డ్రైవర్‌పై దాడి చేశారు. 104 వాహనాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై స్థానికులను ఆరా తీశారు. 104 వాహనం నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.